• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రశాంతంగా పరీక్షలు రాయండి: కలెక్టర్

PPM: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు సంబంధించి సర్వం సిద్ధమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. విద్యార్థులు అనవసర ఆందోళనకు గురికాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరుతూ, విద్యార్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’! అంటూ కలెక్టర్ విషెస్ చెప్పారు.

February 21, 2026 / 05:31 PM IST

‘ఎమ్మెల్సీ అనంతభాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’

KRNL: రాష్ట్రంలో సంచలనాన్ని రేపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసులో సీబీఐ ఆయన భార్యను కూడా ఏ2 ముద్దాయిగా చేర్చిందని సమతా సైనిక్ దళ్ ప్రతినిధి రంగయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగకుండా వ్యవస్థలలో సడలింపు చేస్తున్న అనంతబాబు కుటుంబంపై సీబీఐ షాక్ ఇచ్చారన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో

MBNR: కౌకుంట్ల మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫిర్యాదు ఇవ్వాలన్నా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం తక్షణమే సొంత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

February 21, 2026 / 05:30 PM IST

కలెక్టర్‌తో ఎంపీ రఘురాంరెడ్డి భేటీ

KMM: ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను కలిశారు. ఆయనకు అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌తో భేటీ అయ్యారు. ఎంపీ నిధుల పనుల పురోగతిపై ఆరా తీశారు. కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఈజీఎస్ పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని సూచించారు.

February 21, 2026 / 05:30 PM IST

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ ఐ

KDP: ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం పులివెందుల పట్టణంలోని స్థానిక పార్నపల్లె బస్టాండ్, కడప బస్టాండ్, తదితర ప్రాంతాలలో ప్రజలకు ఆయన దొంగతనాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు ఆభరణాలను ధరించి బస్సులలో ప్రయాణించరాదన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

ఖోఖో పోటీలకు ఎంపికైన విద్యార్థిని అనుష్క

MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుష్క తన అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 21, 2026 / 05:30 PM IST

‘ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేయాలి’

MDK: రేగోడ్ కేజీబీవీలో విద్యార్థుల అస్వస్థతకు బాధ్యులుగా ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు అస్వస్థకు గురైతే ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదంటూ రిపోర్టులో పేర్కొనడాన్ని తప్పుపట్టారు.

February 21, 2026 / 05:30 PM IST

దుంపగడప కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

W.G: ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. గత సంవత్సరం డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేలు నగదు బహుమతిని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ కె.సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

‘అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి’

ఆసిఫాబాద్ జిల్లాలో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలని కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అన్ని విభాగాల అన్ని రకాల అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 05:28 PM IST

సోషలిజమే దేశానికి దిక్కు: సీపీఎం

TPT: సత్యవేడులో రెడ్ బుక్ డే సందర్భంగా శనివారం సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పెట్టుబడిదారీ విధానంలో అసమానతలు, దోపిడి పెరుగుతున్నాయని, సోషలిజమే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. కార్మికులు, రైతుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 05:27 PM IST

అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు: హరీష్

TG: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అరెస్టై సంగారెడ్డి జైలులో ఉన్న BRS కార్యకర్తలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రచార సమయం ముగిసినా తర్వాత కూడా కాంగ్రెస్ MLAలు ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు డబ్బు పంపిణీ చేసేందుకు పోలీసులు దగ్గరుండి సహకరించారన్నారు. అర్ధరాత్రి డబ్బులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలపై ఎందుకు కేసులు పెట్టలేదన్నారు.

February 21, 2026 / 05:27 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

NRPT: మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సరస్వతి జనార్దన్ తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలపై విచారించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్ పావనిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

February 21, 2026 / 05:25 PM IST

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. వ్యక్తికి తీవ్ర గాయాలు

నల్గొండ: శాలిగౌరారం మండలం మాదారం కలాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్వపల్లి నుండి నకిరేకల్ వైపు భైక్‌పై వస్తున్న ఊట్కూరి వీరయ్య డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది వెంటనే చేరుకుని గాయపడిన వీరయ్యను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 05:25 PM IST

ఆంథ్రోపిక్ క్లాడ్.. 10 బిలియన్ డాలర్లు ఆవిరి..!

ఆంథ్రోపిక్ క్లాడ్.. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ని ప్రకటించింది. అది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేస్తుంది. అందులోని లోపాలను సరిదిద్దేందుకు పరిష్కారాలను సిఫార్సు చేస్తుంది. ఈ పోస్టుతో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు 5-9 శాతం మేర కుంగాయి. మొత్తంగా మదుపర్ల సంపద 10 బిలియన్ డాలర్ల మేర ఆవిరయ్యిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

February 21, 2026 / 05:24 PM IST

మాజీ MLA సతీమణికి జాతీయ ST కమిషన్ సభ్యుడు నివాళి

HNK: వర్దన్నపేట మాజీ MLA వన్నాల శ్రీరాములు సతీమణి విజయ ప్రథమ వర్ధంతి కార్యక్రమం హంటర్ రోడ్డులో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ చిత్రపటం వద్ద ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాణాప్రతాప్ తదితరులున్నారు.

February 21, 2026 / 05:24 PM IST