• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

NASO పోటీల్లో సత్తా చాటిన గుంతకల్లు విద్యార్థి

ATP: గుంతకల్లులోని భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన NASO పోటీలలో అత్యంత ప్రతిభ కనిపించాడు. ఇండియా వైడ్ 9వ ర్యాంకు స్టేట్ వైడ్ 2వ ర్యాంకు సాధించాడు. శనివారం ఆ విద్యార్థిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తన చాంబర్లో శాలువాతో సత్కరించి సన్మానించి అభినందించారు.

February 21, 2026 / 05:20 PM IST

ఢిల్లీలో హైఅలర్ట్.. రెండు IED బాంబులు నిర్వీర్యం

ఉగ్రకుట్రల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఢిల్లీలో హైఅలర్ట్ జారీ చేశారు. పంజాబ్, కాశ్మీర్‌లలో భద్రతాదళాలు భారీ ప్రమాదాన్ని తప్పించాయి. అమృత్‌సర్‌తో పాటు కాశ్మీర్‌లో లభ్యమైన రెండు IED బాంబులను గంటల వ్యవధిలోనే విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టిన భద్రతాదళాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి.

February 21, 2026 / 05:18 PM IST

తప్పు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: కాటిపల్లి

TG: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరో సవాల్ విసిరారు. సోమవారం కలెక్టరేట్‌కు వస్తా.. తన తప్పు ఏంటో నిరూపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలు అడ్డుకున్నందుకే తనపై కక్ష గట్టారని అన్నారు. తన తప్పు రుజువు చేస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీపై గౌరవంతో ఇన్ని రోజులు మర్యాద ఇచ్చానన్నారు.

February 21, 2026 / 05:15 PM IST

జనసేన సభ్యత్వాలు.. మంత్రి నాదెండ్ల కీలక సూచనలు

AP: జనసేన సభ్యత్వ నమోదు ప్రణాళికపై ఆ పార్టీ నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధక్‌లను ప్రతి నియోకవర్గం నుంచి 75 మంది నుంచి 100 మంది వరకు ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. జనసేన సభ్యత్వ నమోదు ఏటా భారీగా పెరుగుతూ వెళ్తోందన్నారు. చివరిసారి 12.6 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు.

February 21, 2026 / 05:13 PM IST

సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మార్చి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు Steam Rice సరఫరా చేయనుంది. ప్రస్తుతం అందిస్తున్న సన్నబియ్యం అన్నం ముద్దగా అవుతుండటంతో, విద్యార్థులకు పొడిపొడిగా, రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

February 21, 2026 / 05:10 PM IST

సేవ చేయడం గొప్ప లక్షణం: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో శనివారం నిర్వహించిన NSS స్పెషల్ క్యాంప్‌కు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. సేవ చేయడం గొప్ప లక్షణం విద్యార్థి దశనుంచే సేవలు చేసే గుణం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బొజ్జాయిగూడెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.

February 21, 2026 / 05:09 PM IST

రేపు జిల్లాకు రానున్న CM

MLG: CM రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 10గం కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు పర్యటనకు ముఖ్యఅతిథిగా CM రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై CM పర్యటనను విజయవంతం చేయాలన్నారు.

February 21, 2026 / 05:08 PM IST

కాంగ్రెస్ ఓటు శాతం పెరిగింది: సీఎం రేవంత్

TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్నెళ్ల తర్వాత జరిగిన MP ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందన్నారు. రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 27 శాతం పెరిగిందన్నారు. కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకం వల్లే కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతోందన్నారు.

February 21, 2026 / 05:08 PM IST

‘ప్రేరణ విజయానికి తొలి అడుగు’

MDK: శివంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫౌండేషన్, గురుకులం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘ప్రేరణ విజయానికి తొలి అడుగు’ కార్యక్రమ నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధనకు మార్గదర్శనం చేయడానికి కార్యక్రమం చేపట్టినట్లు కో- ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు.

February 21, 2026 / 05:08 PM IST

ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎంపీడీవో

PDPL: ధర్మారం మండలం కొత్తూరు అంగన్వాడి, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపీడీవో వేముల సుమలత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ZP పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో సంభాషించారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ సందర్శించారు. మధ్యాహ్న భోజనం, ప్రత్యేక స్టడీ అవర్స్ గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య సంగీత పాల్గొన్నారు.

February 21, 2026 / 05:07 PM IST

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

ADB: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.

February 21, 2026 / 05:07 PM IST

BREAKING: చరిత్ర సృష్టించిన టీమిండియా

ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు సంచలనం సృష్టించింది. పటిష్టమైన ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో హర్మన్‌ప్రీత్ సేన కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్ 176 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది. కాగా, ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

February 21, 2026 / 05:07 PM IST

అగ్నిప్రమాదంలో జీడి తోట దగ్ధం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో జీడి తోట దగ్ధం అయింది. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని రైతులు తెలిపారు.

February 21, 2026 / 05:05 PM IST

ఎలిప్యాడ్‌ను పరిశీలించిన ఎస్పీ

SRCL: గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలో ఏర్పాట్లను,హెలిప్యాడ్‌ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని తెలిపారు.

February 21, 2026 / 05:05 PM IST

ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ కార్యక్రమం

KMM: ఎర్రుపాలెం మండలం నారాయణపురంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మధిర మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడారు. ఆయిల్ పామ్ లాభదాయక పంటగా మారుతోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

February 21, 2026 / 05:05 PM IST