• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

APPLY NOW: 25 ఏళ్ల లోపు ఉన్నారా..?

TG: HYD పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సిటీ పోలీసు విభాగంలో 25 ఏళ్లలోపు డిగ్రీ, PG విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం ఇచ్చారు. డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు.

February 21, 2026 / 05:03 PM IST

DCC పదవి ఎంతో విలువైనది: CM రేవంత్

TG: కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవి ఎంతో విలువైనది.. వచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్.. డీసీసీ నుంచి పీసీసీ కావొచ్చు.. ఎమ్మెల్యే కావొచ్చు. ఎంపీ కావొచ్చు.. సీఎం కావొచ్చన్నారు. ఒక కోటాలో డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారని.. ప్రజల కోసం ఆ పదవిని ఉపయోగించుకోవాలని చెప్పారు.

February 21, 2026 / 05:03 PM IST

మాతృభాషను కాపాడుకోవాలి: ప్రిన్సిపల్ రవి

NLG: దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ.. మాతృభాష ఉనికిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాలు మాతృభాషతో పెనవేసుకుని ఉంటాయని పేర్కొన్నారు.

February 21, 2026 / 05:03 PM IST

మిషన్ భగీరథ నీటి సరఫరా మూడు రోజులు నిలిపివేత

JGL: మెట్పల్లి మండలం వెంకట్రావు పేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజీ మరమ్మతు కారణంగా మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ తెలిపారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఈనెల 23 నుంచి 25 వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 05:03 PM IST

‘నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం’

SKLM: నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. శనివారం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామపంచాయతీలో బలిజపల్లి జానకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో నూతనంగా నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకటరావు అధికారులు , నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:03 PM IST

సీఎం పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నారు: MLA

NLR: 20 నెలల స్వల్ప కాలంలోనే కోవూరు నియోజకవర్గంలో ​ 687 మంది అనారోగ్య బాధితులకు 7 కోట్ల 27 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. శనివారం 24 వ విడతగా 35 మందికి రూ. 55 లక్షల 42 వేల చెక్కులు అందించమన్నారు. ​వేలాది మందికి పునర్జన్మ ప్రసాదిస్తూ.. పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 05:03 PM IST

న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ. పీ. రమేష్ బాబు, న్యూ పీజీ బాయ్స్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, హాస్టల్ సౌకర్యాలపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ డా. మన్నెమోని కృష్ణయ్య, ప్రిన్సిపల్ డా.సీహెచ్. రవికాంత్ పాల్గొన్నారు.

February 21, 2026 / 05:02 PM IST

జీరో లిట్టర్ గవర్నెన్స్ పై అవగాహన

ASP: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ డిగ్రీ కళాశాలల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా జీరో లిట్టర్ గవర్నెన్స్‌పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. చెత్త రహిత రాష్ట్రంగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రిన్సిపాల్స్ డా కేబీకే నాయక్, చలపతిరావులు తెలిపారు. పరిసరాలను శుభ్రపరిచే భాద్యత అందరిదీ అని అన్నారు.

February 21, 2026 / 05:01 PM IST

యూరియా కోసం ఉరితాడుతో వినూత్న రీతిలో నిరసన

SRPT: యూరియా యూప్ నిబంధనలకు వ్యతిరేకంగా పాలకవీడు పీఏసీఎస్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకుడు నవీన్ కుమార్ రైతులతో కలిసి వినూత్న రీతిలో శనివారం నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు వేసుకొని ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే ప్రభుత్వం యాప్ రద్దుచేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందించాలన్నారు.

February 21, 2026 / 05:01 PM IST

ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు పరిశీలన

మదనపల్లి పట్టణం నక్కలదిన్నె బీటీ కళాశాల మైదానంలో రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మహిళలు-పురుషులకు వాకింగ్ ట్రాక్, జిమ్, పిల్లల కోసం చిన్న పార్క్ ఏర్పాటుపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రతిపాదిత పనులపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

February 21, 2026 / 05:00 PM IST

పునర్విక కోసం సాంజో స్కూల్ విరాళం

NDL: ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో చిన్నారి పునర్విక చికిత్స కోసం సాంజో స్కూల్ విద్యార్థులు రూ.24,997 విరాళం శనివారం అందజేశారు. విద్యార్థులు తమ ఖర్చు డబ్బులు, పొదుపు మొత్తాలను చందాలుగా సమీకరించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ అనేట్, యాజమాన్యం, ఉపాధ్యాయులు సహకరించారు. సేవాసమితి సభ్యులు విద్యార్థులను అభినందించారు.

February 21, 2026 / 05:00 PM IST

బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ

W.G: తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని అక్కడ బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ గురించి పరిశీలించడం జరిగింది. నాలుగు రంగుల చెత్త బుట్టలు-ఎరుపు, పసుపు, నీలం, తెలుపు ఏర్పాటు చేసి వచ్చిన వ్యర్థాలను తదనుగుణంగా తీసి సరైన పద్దతిలో డిస్పోజ్ చేసే విషయం గురించి పరిశీలించారు.

February 21, 2026 / 05:00 PM IST

ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం: MLA

కోనసీమ: రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అల్లవరంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.

February 21, 2026 / 05:00 PM IST

భాష్యం విద్యా సంస్థ ఎదుట ధర్నా

ATP: గుంతకల్లులోని భాష్యం విద్యా సంస్థ ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ.. కోర్సుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. 

February 21, 2026 / 05:00 PM IST

ట్రాక్టర్-బైక్ ఢీ.. వ్యక్తికీ తీవ్రగాయాలు

MNCL: కాసిపేట్ మండలం కొండాపూర్ వద్ద శనివారం ట్రాక్టర్-బైక్ ఢీకొన్న ప్రమాదంలో తుడుంగూడకు చెందిన చాకటి ఇస్ఫతికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి కుడి కాలు, చేయి విరగడంతో స్థానికులు 108కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది EMT ఆత్మారావు, పైలట్ కొమురయ్య ప్రథమ చికిత్స అందించి, చికిత్స నిమిత్తం మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 05:00 PM IST