• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రియాంక గాంధీని కలిసిన డిప్యూటీ సీఎం భట్టి

KMM: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆమెకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 21, 2026 / 04:42 PM IST

చిత్తూరులో అభివృద్ధి పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 4వ వార్డు కట్టమంచి లాయర్స్ కాలనీలో రూ. 19.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. లాయర్స్ కాలనీ ఎక్స్‌టైన్ష‌న్‌‌కు“వెంకటరమణ నగర్”గా నామకరణం చేసి ఆవిష్కరించారు.

February 21, 2026 / 04:41 PM IST

మెరిట్ ఉన్నవారికే పదవులు: రేవంత్ రెడ్డి

TG: గతంలో DCC అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే టికెట్ రానివారికి ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. పార్టీ కోసం కృషి చేసిన మరో 60 మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. పార్టీలో అందరి పని తీరు మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. మెరిట్ ఉన్న వారికి పార్టీలో కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు.

February 21, 2026 / 04:41 PM IST

YCP నేతల తీరు దుర్మార్గం: మంత్రి కొల్లు

AP: YCP నేతల తీరు దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీకి రారని.. మండలిలో సభ జరగనివ్వట్లేదని తెలిపారు. దేవదేవుడి ఫొటోలు పట్టుకుని మండలికి చెప్పులతో వచ్చారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో అన్నిరంగాల్లోనూ దోపిడీయేనని పేర్కొన్నారు.

February 21, 2026 / 04:40 PM IST

TVK పార్టీ యానాం ఇన్‌ఛార్జ్‌గా తోట రాజు

కోనసీమ: దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తోంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, పుదుచ్చేరిలోని యానాం ప్రాంతానికి ఎ. తోట రాజును పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.

February 21, 2026 / 04:40 PM IST

ఆలయ ప్రతిష్టాపనకు రావాలని ఆహ్వానం అందజేత

E.G: కడియం మండలం వేమగిరిలో నిర్మించిన శ్రీ ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపనకు ఆలయ కమిటీ పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. మంత్రి కందుల దుర్గేష్, MLAలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బల రామకృష్ణ, MLC సోము వీర్రాజు, తదితరులకు శనివారం ఆహ్వాన పత్రికలు అందించారు. ఈనెల 26న ఆలయ ప్రతిష్టాపన జరుగుతుందన్నారు.

February 21, 2026 / 04:40 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రెడ్డి

MHBD: తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు ఉప్పలయ్య- ధనమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు ధర్మారపు ప్రశాంత్ కుమార్ వివాహ వేడుక శనివారం కళ్యాణలక్ష్మి గార్డెన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరై, నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

February 21, 2026 / 04:40 PM IST

అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక వాహబ్ పేట, ఉమామహేశ్వరి శివాలయం ప్రాంతంలో జరుగుతున్న యెల్లి కాలువ అభివృద్ధి పనులను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలన్నారు. పనులు నాణ్యతతో జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 04:40 PM IST

పెన్షనర్స్ భవనంలో ఘనంగా మాతృభాష దినోత్సవం

ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో శనివారం మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మా తెలుగు తల్లి చిత్రపటానికి కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు, సెక్రెటరీ రామ్మోహన్ పూలమాల వేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ‘దేశ భాషలందు తెలుసు లెస్స’ అని శ్రీకృష్ణదేవ రాయలు అన్న విషయాన్ని గుర్తు చేశారు.

February 21, 2026 / 04:40 PM IST

23న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

KRNL: ఈనెల 23న కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తామని చెప్పారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయాలని, meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని ఆమె వెల్లడించారు.

February 21, 2026 / 04:40 PM IST

మణికట్టు నొప్పిని తగ్గించే చిట్కాలు

మౌస్, కీబోర్డ్ నిరంతరం వాడేవారికి మణికట్టు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి గంటకోసారి చేతులను నిటారుగా సాగదీయాలి. మణికట్టును నెమ్మదిగా గుండ్రంగా తిప్పితే బెటర్. పని మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. అరచేతిని గట్టిగా మూసి మళ్లీ పూర్తిగా తెరవాలి. ఇది వేళ్లు, మణికట్టు కండరాలకు బలాన్నిస్తుంది. ఇలా చేయడం వల్ల నరాలు ఒత్తిడికి గురవ్వకుండా మణికట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

February 21, 2026 / 04:38 PM IST

‘వచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి’

కృష్ణా: నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెనుమూరు మండలం తాడిగడప కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాలో యువకులు ఈరోజు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేటి యువతీ యువకులు చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని నిరుత్సాహ పడకుండా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:38 PM IST

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

సూర్యాపేట: పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల ఓరియంటేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 69 కేంద్రాల్లో 12,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు.

February 21, 2026 / 04:37 PM IST

కంభంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం

ప్రకాశం: కంభంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి పరిసరాల పరిశుభ్రతపై సిబ్బందికి అవగాహన కల్పించారు. శుభ్రమైన వాతావరణం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:37 PM IST

పరిశ్రమల ప్రమాదాలపై మాకు డ్రిల్

SKLM: పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తత, సమన్వయం ఎంతో కీలకమని జిల్లా పరిశ్రమల సంయుక్త తనిఖీ అధికారి శివశంకర్ అన్నారు. శనివారం పైడి భీమవరం సరగడపేటలో పరిశ్రమల్లో విషవాయువు లీకేజీ అయినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలో అనే దాని పై మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు నిర్వహణ అధికారి రాము, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహనరావు ఉన్నారు.

February 21, 2026 / 04:37 PM IST