• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కర్ల రాజేశ్ లాకప్ డెత్.. సీఎం మౌనం వీడాలి: మందకృష్ణ

HYD: కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరులో జరిగిన కర్ల రాజేశ్ లాకప్ డెత్ జరిగి నేటికి 95 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఓయూలో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాజేశ్ లాకప్ డెత్‌పై సీఎం మౌనం వీడాలని అన్నారు. PS సీసీ ఫుటేజ్ని పరిశీలించి రీ పోస్టుమార్టం నిర్వహించాలన్నారు.

February 21, 2026 / 04:25 PM IST

నువ్వులతో అద్భుత ప్రయోజనాలు..!

నువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

February 21, 2026 / 04:25 PM IST

వికారాబాద్‌ జిల్లా అనంతగిరి చేరుకున్న సీఎం

TG: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతకముందు అనంతగిరి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు.

February 21, 2026 / 04:23 PM IST

‘సొంత ఆదాయ వనరులు పెంచుకోవాలి’

TPT: సత్యవేడులో నిర్వహించిన పంచాయతీ సెక్రటరీల శిక్షణలో ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీ సొంత ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని సూచించారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెరువుల వేలం, సంతలు, భవన అనుమతులు, లైసెన్సులు, అద్దెలు వంటి మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రభుత్వ గ్రాంట్లపై మాత్రమే ఆధారపడకుండా పన్నులు సకాలంలో వసూలు చేయాలని అన్నారు.

February 21, 2026 / 04:23 PM IST

ఆదోని జిల్లా సాధన ఉద్యమం 98వ రోజు

KRNL: ఆదోని జిల్లా సాధన ఉద్యమం శనివారానికి 98వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల మోనోభావాలను కూటమి ప్రభుత్వం గౌరవించాలని నాయకులు డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన పోరాటంపై నిర్లక్ష్యం తగదని, సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆదోని జిల్లాపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని JAC నాయకులు కోరారు.

February 21, 2026 / 04:21 PM IST

వైద్య ఖర్చుల కోసం LOC పత్రం అందజేత

E.G: కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామానికి చెందిన ఆకుల రాజకుమారికి వైద్య ఖర్చులకోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువైన LOC పత్రాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. అవసర సమయంలో బాధితులకు ప్రభుత్వం తోడుగా నిలవడం ఎంతో ముఖ్యమన్నారు. అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు.

February 21, 2026 / 04:20 PM IST

కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: ఇందుకూరుపేట పంచాయతీలోని శ్రీ ఇందుపూరమ్మ దేశమ్మ దేవతల మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.

February 21, 2026 / 04:20 PM IST

ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్

ATP: అనంతపురంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 25 లక్షల విలువైన 143 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకరైన బాష @ కురుబ రామాంజినేయులు పాత నేరస్థుడని, అతనిపై 15 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

February 21, 2026 / 04:20 PM IST

ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు: డీఈవో

SRD: జిల్లాలోని అన్ని స్కూల్స్‌లో 1 -9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఎస్ఎ-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.

February 21, 2026 / 04:19 PM IST

లక్ష ఎకరాలకు నీరందిస్తాం: మంత్రి

TG: సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఆందోల్ నియోజకవర్గానికి మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా పోసానిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్డీ డిస్టలరీని మంత్రి ప్రారంభించారు. ఈ సంస్థను విస్తరించి 500 మందికి ఉపాధి కల్పించేలా చేస్తామన్నారు.

February 21, 2026 / 04:17 PM IST

గాడ్‌మదర్ ఆఫ్ కార్డియాలజీ: డాక్టర్ పద్మావతి

భారతదేశ వైద్యరంగంలో గాడ్‌మదర్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ ఎస్.ఐ. పద్మావతి ప్రయాణం స్పూర్తిదాయకం. బర్మా నుండి వలస వచ్చి దేశంలోనే తొలి క్యాత్ ల్యాబ్‌ను స్థాపించి వైద్యరంగంలో విప్లవం తెచ్చారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి, 90 ఏళ్ల వయసులోనూ రోగులకు సేవ చేస్తూ ఆదర్శంగా నిలిచారు. గుండె వైద్య రంగంలో ఆమె చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది.

February 21, 2026 / 04:17 PM IST

HYDలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ పాటిల్ పర్యటన

HYD: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ పాటిల్ ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పాటిల్‌కు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఘన స్వాగతం పలికారు. నగరంలోని వివిధ కార్యక్రమాలలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

February 21, 2026 / 04:16 PM IST

ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ

JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులకు సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి భూమి ప్రదేశం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఉన్న బండలను తొలగించి, ప్రహరి గోడ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆలయ కమిటీ తెలిపారు. సర్పంచ్‌తో పాటు, మాజీ ఎంపీటీసీ, మాజీ విండో డైరెక్టర్, కుల సంఘల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:15 PM IST

​నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు ఇంటర్ ప్రశ్నపత్రాలు

SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి సెట్-A ప్రశ్నపత్రాలు శనివారం నడిగూడెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. పరీక్షల నిర్వాహకులు వీటిని పోలీస్ స్టేషన్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ​నడిగూడెంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 04:15 PM IST

ప్రత్యేక తరగతులకు తప్పకుండా హాజరు కావాలి: కలెక్టర్

MDK: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ చిన్నశంకరంపేట్ మండలం సూరారం జడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి, సబ్జెక్టులవారీగా చదివే విధానం వివరించారు. తల్లిదండ్రులు హాజరుపై దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రోత్సహించాలని అన్నారు.

February 21, 2026 / 04:14 PM IST