SRD: రాయికోడ్ మండలం ఔరంగ నగర్ లో బొంగుండేశ్వర విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు విట్టల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కురుమ సంఘం నాయకులు పైతర సాయికుమార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన మాట్లాడుతూ.. తన అద్భుత శక్తులతో మానవుల సమస్యలను పరిష్కరించి, గొప్ప వ్యక్తిగా మారిన వారిలో బొంగుండేశ్వర స్వామి ఒకరని కొనియాడారు.
NZB: బాన్సువాడలో శుక్రవారం రాత్రి ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను శనివారం పోలీసులు భిక్కనూర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భిక్కనూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.
W.G: ఆకివీడులో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి కృష్ణ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ 165లోని పలు రహదారులను ఆయన పరిశీలించారు. స్థానిక అధికారులతో చర్చించారు. ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణ రాజుతో ఆయన ప్రత్యేక సమావేశం అయ్యారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఇంఛార్జ్ తహశీల్దార్ ఫరూక్, ఆర్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.
SKLM: శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జయదేవ్ పాల్గొన్నారు.
అభిషేక్ శర్మ ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన చెందుతున్న వారిని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. నిజానికి మీరు అతని గురించి కాదు, రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోబోయే ప్రత్యర్థి జట్ల గురించి ఆందోళన చెందాలి’ అని సూర్య తెలిపాడు. గతేడాది అభిషేక్ జట్టు కోసం చాలా చేశాడని, ఇప్పుడు అతనికి అండగా నిలివాల్సిన బాధ్యత తమపై ఉందన్నాడు.
VSP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీఎంఆర్డీఏలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఉద్యోగ్ భవన్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను ఉద్యోగులు తొలగించి శుభ్రపరిచారు. అనంతరం కార్యదర్శి మురళీకృష్ణ సిబ్బందితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
KDP: జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ ఉత్తర్వుల మేరకు SDPO వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ కాలనీలో ఉదయం 4.30 గంటల నుంచి సోదాలు చేపట్టారు. స్వాధీనం చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి. సతీష్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్య ప్రదేశ్‌లో జరుగనున్నాయి. దీంతో అతన్ని పలువురు అభినందించారు.
E.G: శాసనమండలిలో వైసీపీ MLCలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని దేవుడి ఫొటోలు పట్టుకోవడం అత్యంత అపచారమన్నారు. ఈ ఘటనపై జగన్ మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
AKP: ఎలమంచిలి పట్టణం ధర్మవరం ప్రాంతంలో శనివారం పర్యటించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మురికి కాలువలను పరిశీలించారు. తక్షణం కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం డ్రైనేజ్ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. డ్రైనేజ్‌పై అనధికారికంగా ఉంచిన పలకలను తొలగించాలని ఆదేశించారు. గత పాలకులు డ్రైనేజ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు.
ASF: మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు 13వ వార్డు కౌన్సిలర్ స్నేహపై చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారి, RDO జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించి విప్ ధిక్కరణ నిజమని తేల్చారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం ఆమెను కౌన్సిలర్ పదవి నుంచి అనర్హురాలిగా ప్రకటించారు.
ELR: కొబ్బరికాయలు ధరలు పడిపోకుండా చర్యలు చేపట్టి కొబ్బరి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరులో ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లలో కొబ్బరి సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని గుర్తు చేశారు.
KRNL: జిల్లాలో అధిక శబ్దం చేసే బైక్ సైలెన్సర్లు, ఆటో హారన్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 100 సైలెన్సర్లు, 500 హారన్లను సీజ్ చేసి రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. శబ్ద కాలుష్యంపై ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మోటార్ వాహన చట్టం ప్రకారం అనుమతి లేని మార్పులు చేసిన వాహనాలను నడుపరాదన్నారు
సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 243 మందికి రూ.2.44 కోట్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ATP: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ. 45.85 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైంది. ఇందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 36 మందికి రూ. 36.60 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. శనివారం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.