• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సమస్య చెప్పండి.. పరిష్కరించే బాధ్యత నాది’

SRPT: సమస్యలు చెప్పండి పరిష్కరించే బాధ్యత నాదని సూర్యాపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ దత్త సాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఛైర్‌పర్సన్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.

February 21, 2026 / 01:28 PM IST

‘టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాం’

KRNL: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన శనివారం జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పెద్దకడబూరు టీడీపీ మండల అధ్యక్షులు మల్లికార్జున, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు హాజరయ్యారు. పెద్దకడబూరు మండలంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.

February 21, 2026 / 01:28 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

BPT: సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు రూ. 50,95,248 విలువైన చెక్కులను అందజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

February 21, 2026 / 01:27 PM IST

పరిసరాల శుభ్రత కార్యక్రమం

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం చేపట్టే ఈ కార్యక్రమంలో సి.ఐలు,ఎస్.ఐలు,సిబ్బంది పాల్గొని స్టేషన్లు,పరిసరాలను శుభ్రం చేశారు.చెత్త తొలగింపు,పిచ్చి మొక్కల నిర్మూలనతో పాటు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.

February 21, 2026 / 01:26 PM IST

వీధి కుక్కల స్వైర విహారం..గొర్రెలు మృతి

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని సిలార్‌పల్లి, తిమ్మరాసిపల్లి ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సిలార్‌పల్లి సమీపంలోని పొలంలో దాదాపు 30 గొర్రెలపై కుక్కలు దాడి చేసి చంపివేయడం కలకలం రేపింది. అటు పెంపుడు కోళ్లను సైతం వదలకుండా వేటాడుతున్నాయని, అధికారులు కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.

February 21, 2026 / 01:26 PM IST

బడి రుణం తీర్చుకున్నారు..!

W.G: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆకివీడు పులవర్తి లక్ష్మణస్వామి జడ్పీ హైస్కూల్లో శనివారం సౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. 1984-85 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు రూ.80,000 వ్యయంతో దీనిని పాఠశాలకు కానుకగా ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠనాయుడు విద్యార్థుల సమక్షంలో దీనిని ప్రారంభించి, పూర్వ విద్యార్థుల సేవా గుణాన్ని అభినందించారు.

February 21, 2026 / 01:25 PM IST

నందిగామలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం

ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని ఏడో వార్డులో శనివారం స్వచ్ఛంద – స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి వీధిలో శుభ్రత, చెత్త తొలగింపు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.

February 21, 2026 / 01:24 PM IST

IND vs AUS: తుది జట్లు ఇవే

భారత్: స్మృతి, హర్మన్(C), షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, రీచా ఘోష్, దీప్తి శర్మ, అరుంధతి, అమన్‌జోత్ కౌర్, శ్రేయాంకా పాటిల్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్ఆస్ట్రేలియా: బెత్ మూనీ, జార్జియా వోల్, లిచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, జార్జియా వరెహామ్, గ్రేస్ హారిస్, సుదర్లాండ్, సోఫీ మొలినెక్స్(C), కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్

February 21, 2026 / 01:24 PM IST

‘క్రీడల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం’

WNP: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ‘సి.ఎం. కప్ 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా’ టోర్నమెంట్‌ను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.క్రీడలకు బడ్జెట్లో రూ. 700 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.

February 21, 2026 / 01:23 PM IST

సినీ నటుడిని కలిసిన మంత్రి

అన్నమయ్య: ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత రాజేంద్ర ప్రసాద్‌ను హైదరాబాద్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమకాలీన అంశాలు, సామాజిక సేవా కార్యక్రమాల గురించి చర్చించారు. యువతకు ప్రేరణగా నిలుస్తున్న రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.

February 21, 2026 / 01:23 PM IST

ఓటర్ల జాబితా సవరణపై అధికారుల సమీక్ష

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీవో కేశ్వర్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ, మ్యాపింగ్ ప్రక్రియపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల వివరాలను 2025 జాబితాతో అనుసంధానం చేసే (Mapping) కీలక ప్రక్రియ కొనసాగుతోందని, దీనికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 01:22 PM IST

T20 WC: ఒక్కటీ గెలవకుండానే ఔట్.. అయినా!

T20 WCలో నిన్నటితో గ్రూప్ దశ ముగియగా.. ఒమన్, కెనడా, నమీబియా ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయినప్పటికీ ICC ఈ 3 పసికూనలకు టోర్నీలో పాల్గొన్నందుకు ప్రోత్సాహకంగా కనీసం రూ.2 కోట్లు ఇవ్వనుంది. గత టోర్నీలోనూ 20 టీమ్స్ ఆడగా.. 9-12 స్థానాల్లో నిలిచిన జట్లకు $247000(₹2.24Cr), 13-20 స్థానల్లో నిలిచినవాటికి $225000(₹2.04Cr) చొప్పున అందజేసింది.

February 21, 2026 / 01:22 PM IST

తప్పొప్పులు చెప్పడం వరకే మన బాధ్యత: మీనా

‘రోసిన్’ సిరీస్‌లో తాను అమ్మ పాత్ర పోషించానని మీనా తెలిపింది. ‘నేను అమ్మను అయ్యాకే సిరీస్‌లోని తల్లి పాత్ర విలువను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోగలిగా. అందుకే ఎమోషనల్ సీన్స్‌లో ప్రతి డైలాగ్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటి తరం పిల్లలకు అన్ని విషయాలపై అవగాహన ఎక్కువ, ఏది చెప్పినా తెలుసు అంటారు. ఏది తప్పో, ఏది ఒప్పో వారికి చెప్పడం వరకే మన బాధ్యత’ అని తెలిపింది.

February 21, 2026 / 01:22 PM IST

సమస్యలపై పోరాటం.. వీధిలైట్లు ఏర్పాటు

RR: నందిగామ గ్రామాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో సమస్యలు లేని గ్రామంగా రూపకల్పన చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని సర్పంచ్ కొమ్ము కృష్ణ అన్నారు. 3వ వార్డు సభ్యులు సురేష్ ఆధ్వర్యంలో కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యలపై పోరాటం చేస్తూ ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

February 21, 2026 / 01:22 PM IST

ఏకకాలంలో పలుచోట్ల ఏసీబీ తనిఖీలు

TG: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పానుగోడులో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. వ్యవసాయ శాఖ ఏడీఏ కిరణ్ కుమార్ ఇల్లు, కల్వకుర్తిలోని ఆయన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ ఈ చర్యలు తీసుకుంది. గతంలో ఈయన సూర్యాపేట డీఆర్డీఏ పీడీగా పనిచేశారు. ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

February 21, 2026 / 01:20 PM IST