TG: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పానుగోడులో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. వ్యవసాయ శాఖ ఏడీఏ కిరణ్ కుమార్ ఇల్లు, కల్వకుర్తిలోని ఆయన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ ఈ చర్యలు తీసుకుంది. గతంలో ఈయన సూర్యాపేట డీఆర్డీఏ పీడీగా పనిచేశారు. ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా అమ్మాయిలతో మూడో T20లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 3 T20ల సిరీస్‌లో ఇప్పటికే ఇరుజట్లు చెరొకటి గెలవగా.. ఇందులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని హర్మన్ సేన భావిస్తోంది.
PPM: సీతానగరం మండలం జోగింపేట కేజీబీవీ హాస్టల్ విద్యార్దినీలకు MLHPలోకేశ్వరి శనివారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హెమోగ్లోబిన్, జలుబు, దగ్గు, దురదలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తగినంత నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
VZM: వంగర ఎంపీడీవో కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు శనివారం స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వలన భూగర్భ జలాలు పాడైపోతున్నాయని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని డిప్యూటీ ఎంపీడీవో రామారావు కోరారు.
కోనసీమ: తిరుమల లడ్డూ కల్తీ అంశంలో పట్టుబడి వైసీపీ తప్పుల మీద తప్పు చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆరోపించారు. శాసనమండలిలో వేంకటేశ్వరస్వామి చిత్రపటాలకు అపచారంపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా శనివారం రావులపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు.
VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో ఈనెల 25వ తేదీన ఎల్లమ్మ జాతర జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ లెంక రామలక్ష్మి, సత్యనారాయణ దంపతులు తెలిపారు. ఎల్లమ్మ పూజారి రుద్రాక్షల సత్యం, పరశురామున్న పూజారి కర్ణకోట కసవయ్యలు సిరిమాను అధిరోహిస్తారని చెప్పారు. 24న తోలేల ఉత్సవం, 26న కనుము జరుపుతారని తెలిపారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి అనంతరం జరుగుతుందన్నారు.
PPM: కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం తోట శంకరరావు మాట్లాడుతూ.. భాషల వైవిధ్యాన్ని కాపాడటం, మాతృభాషపై గౌరవం పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలిపారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
SRCL: వేములవాడ నుంచి కోరుట్ల పట్టణం సమీపంలోని యకీన్ పూర్ వరకు 100 ఫీట్లతో 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరైనట్లు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే వేములవాడ – కోరుట్ల రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించగా.. వేములవాడ నుంచి యకీన్ పూర్ వరకు రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు మంజూరు అయ్యాయని విప్ తెలిపారు.
E.G: రాజానగరం నియోజకవర్గ పరిధిలో నాణ్యమైన విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శనివారం విద్యుత్ శాఖ అధికారులతో MLA సమావేశమై మాట్లాడారు. గ్రామాల వారీగా కొత్తగా విద్యుత్ పోల్స్, వేలాడుతున్న విద్యుత్ తీగలు తదితర విద్యుత్ సమస్యల కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలన్నారు.
VZM: బొబ్బిలి MLA బేబినాయన శనివారం స్దానిక MPDO కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు ఎర్పాటు చేసిన స్వచ్చ రథాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచడం, తడి-పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ఈ రథం లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండేలా ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
KDP: వల్లూరు సొసైటీ బ్యాంకులో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా అందించాలని అధికారులకు సూచించారు. అవసరానికి మించి యూరియా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడపత్రాన్ని ఆవిష్కరించారు. అగ్రికల్చర్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
E.G: గోపాలపురం నియోజకవర్గంCH పోతేపల్లికి చెందిన యర్రంశెట్టి యేసు – ఝాన్సీ రాణి దంపతులకు పుట్టిన 10 రోజుల పసిబిడ్డ ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక ప్రాణాపాయ స్థితిలో ఉంది. చాలాఖర్చవుతుందని వైద్యులుతెలపడంతో ఆ కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్నిఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లగా శనివారం రూ.3,02,729 ఎల్ఓసీ మంజూరు చేయించారు.
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రఘు వంశీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. పిల్లల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
SKLM: ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. జి. రవికుమార్ మాట్లాడుతూ భావ వ్యక్తీకరణకు మాతృభాష కీలకమని, ప్రపంచ భాషలలో తెలుగు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.
NGKL: పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.. అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.