NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ రాజశేఖర బాబు నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్ర ప్రజా అవగాహన సైకిల్ యాత్ర తిరువూరు సర్కిల్‌ను దాటి జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని వత్సవాయి పోలీస్ స్టేషన్ వద్దకు ఈరోజు ప్రవేశించింది. ఈ యాత్ర కంభంపాడు గ్రామం నుండి ప్రారంభమై వత్సవాయి వరకు కొనసాగింది. డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ తెలిపారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ టేకింగ్, రైటింగ్‌పై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు SMలో వైరలవుతున్నాయి. ‘బుజ్జిగాడు’ కంటే ‘ఏక్ నిరంజన్’లో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఆ క్యారెక్టర్‌ను ఎలా చేయాలా అని ఎక్కువగా ఆలోచించేవాడినని ప్రభాస్ తెలిపాడు. పూరీ డైలాగ్స్, రైటింగ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని, ఆయనలాంటి రైటింగ్ ప్రపంచంలోనే ఎవరూ చేయలేరని, ఎవరి వల్ల కాదని తెలిపాడు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకలు నిర్వహించి, బంగారు,వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారికి సింధూరం, ఆకు, తులసితో పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో నిత్య హోమం చేశారు.
HYD: SLBC సొరంగం ప్రమాదం జరిగి ఏడాదికావస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రజా శ్రేయస్సుపై శ్రద్ధపెడితే ఇలాంటి విషాదాలు జరగవని ట్వీట్ చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలోకానీ సొరంగం పనుల్లోగాని ఎటువంటి పురోగతి లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు.
KMM: మధిర మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన కోన ధని కుమార్‌ని కోన వారి కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సాధించిన ఈ విజయాన్ని కుటుంబ గౌరవంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కోన ధని కుమార్ స్పష్టం చేశారు.
ASF: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పని దినాల లక్ష్యం చేరుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారాం శనివారం ప్రకటనలో తెలిపారు. నిత్యం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గడువులోగా లక్ష్యం చేధించేలా ప్రణాళికలు అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు.
NLR: అక్కడ జనసేన సైలెంట్ అయ్యిందా?.. ఎన్నికల ముందు హడావుడి చేసిన జన సైనికులు ఇప్పుడు ఏమయ్యారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ ఇదే.. నాయకులను సమన్వయం చేసే నాయకుడు లేకపోవడంతోనే జనసేనకు ఈ కష్టం వచ్చిందని పలువురు మాట్లాడుతున్నారు. అది కాక రెండేళ్లుగా జిల్లా అధ్యక్షుడు నియమించకపోవడం కూడా పార్టీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపిందట.
T20 WCలో ఇవాళ న్యూజిలాండ్-పాక్ మధ్య తొలి సూపర్-8 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గత రికార్డుల ప్రకారం ఇరుజట్ల మధ్య పోరు పోటాపోటీగానే( 49 మ్యాచుల్లో 23-24) ఉండనుంది. అయితే గత సిరీస్(2015 మార్చ్)లో PAKను కివీస్ 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. మరి ఒకే మైదానం(కొలంబో)లో ఆడుతున్న PAK ఇవాళ NZపై రాణిస్తుందో లేక గత సరీస్ మాదిరే కివీస్ ముందు చతికిలపడుతుందో చూడాలి.
SKLM: నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య శనివారం దర్శించుకున్నారు. ఆయనకి ఆలయ అర్చకులు సాధన స్వాగతం పలుకుతూ, ప్రత్యేక పూజలు చేపట్టి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయనతోపాటు పలువురు వైసీపీ నాయకులు, తదితరులు ఉన్నారు.
చర్మ సౌందర్యం కోసం 4-2-4 రూల్ ఒక అద్భుతమైన క్లెన్సింగ్ పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. 4 నిమిషాల పాటు ఆయిల్ క్లెన్సర్‌తో ముఖాన్ని మర్దన చేయాలి. ఇది తేమను అందిస్తుంది. ఆ తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్‌తో 2 నిమిషాలు మర్దన చేసి జిడ్డు, మలినాలను తొలగించాలి. అనంతరం ముందుగా 2 నిమిషాలు గోరువెచ్చని నీటితో, తర్వాత 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం “స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా, పట్టణాలను స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 27 నుంచి 31 రోజుల పాటు మగ్గం, బ్యూటీ పార్లర్ ,టైలరింగ్‌లో యువతకు ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్ రామ్ జీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించబడును అని తెలిపారు.
MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా ఓటరు జాబితాలో తప్పు ఒప్పులను సరి చేసుకోవాలని తహశీల్దార్ రజనీకుమారి సూచించారు. ఓటర్ జాబితాలో చనిపోయిన వారి ఓట్లు తొలగించే కార్యక్రమం చేపడుతున్నామని, ఎవరైనా చనిపోతే బీఎల్ఓ వద్ద ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసి చనిపోయిన వారి పేరు తొలగించాలని సూచించారు. ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉందని అన్నారు.
NLG: ఫార్మర్ రిజిస్టీకి మరో 7 రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్టీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.
RR: చౌదరిగూడ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో గణపతి అభయ ఆంజనేయ, శివాలయం, రామాలయం, నవగ్రహాల ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా దేవాలయ అభివృద్ధికి దిలీప్ శర్మ అనే వ్యక్తి రూ. 1,50,000 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోయే విధంగా అందించిన ఈ విరాళం ఆలయ నిర్మాణ పనులు, మహోత్సవ ఏర్పాట్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.