ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
AKP: పరవాడ మండలం జాజులవానిపాలెం, పీ.బోనంగి, కలపాక మీదుగా దళాయిపాలెం వరకు రూ 4.40 కోట్లతో 12.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణంతో గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
NRPT: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో పిల్లలు చదువుకునేలా ఇంటి దగ్గర తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి సూచించారు. శనివారం మిర్జాపూర్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. 100% ఉత్తీర్ణతకోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తున్నారని అందుకు తగ్గట్లు విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు.
BDK: చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలో శనివారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ బండారో నిర్వహించారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఎడ్ల బండిపై ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు బాబు నాయక్ పాల్గొని భోగ్ బండరో నిర్వహించారు. మహారాజ్ చూపించిన అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
HNK: మాతృభాష తీపిని ఆస్వాదించాలని, తెలుగు ఇతిహాసాలను చదవాలని, అమ్మ భాషను మరువవద్దని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా కన్నతల్లి లాంటి మాతృభాషను విస్మరించకూడదని అన్నారు.
ADB: ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో మాతృభాషను నిత్యం వినియోగిస్తూ, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, మాతృభాష పరిరక్షణ ద్వారానే మన సంస్కృతి, మన ఉనికి నిలబడుతుందన్నారు.
TG: తాను ప్రజలతోనే ఉన్నానని.. ప్రజలు కోరుకుంటే రాజకీయబాట పడతానని మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల అన్నారు. త్వరలోనే దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి అజ్ఞాతం వీడతారని చెప్పారు. తాను జన్మించిన TGకు త్వరలోనే వస్తానని అన్నారు. 1980లో ఉన్న TGకు, ఇప్పటి TGకు చాలా తేడా ఉందని తెలిపారు.
అన్నమయ్య: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి జిల్లాలో యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న ‘కూల్ లిప్’ వంటి నికోటిన్ మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పాన్ షాపులు, కిరాణా దుకాణాలపై నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహించాలని సూచించారు.
NDL: అవుకు మండలం రామాపురం గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. టిడిపి నాయకుడు విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం కార్యక్రమంలో బీసీ ఇందిరమ్మ పాల్గొన్నారు. అనంతరం బీసీ ఇందిరమ్మ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
VKB: కుల్కచర్లలో MPDO కార్యాలయం పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ అధిక లోడ్ పడడంతోలో వోల్టేజ్ సమస్యతో వినియోగదారులు బాధపడుతున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని అధిక సామర్థ్యం గల ఏర్పాటు చేసి కరెంటు సమస్యలను పరిష్కరిస్తామని AE నాగరాజు తెలిపారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కరెంటు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు గంజి ఉప్పల్ రెడ్డి తన మూడెకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. వేసవికాలం రాకముందే భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బావుల్లో నీరు లేక రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో చేసేదేమిలేక గంటకు రూ.5వేలు వెచ్చించి, 10 గంటలకు రూ.50 వేలు ఖర్చు చేసి పొక్లైనర్ సహాయంతో పూడిక తీసినట్లు తెలిపారు.
KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా గొర్రెల మేకల పెంపక దార్ల సంఘం డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కాలువ సురేష్ యాదవ్, శంకరపట్నం మండల అధ్యక్షులు కేశవేణి రవీందర్ యాదవ్, గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
W.G: వీరవాసరం మండలం కొణితివాడ బుద్ధ రాయుడు చెరువు వద్ద రూ.3.48 కోట్లతో నిర్మించిన 33 KV ఫీడర్‌ను శనివారం MLA పులపర్తి రామాంజనేయులు, MP పాక సత్యనారాయణ ప్రారంభించారు. భీమవరం నుంచి కొణితివాడ వరకు 16.6 కి.మీ. మేర కొత్త విద్యుత్ లైన్ నిర్మించినట్లు వారు తెలిపారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
HNK: హన్మకొండలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. మున్నూరుకాపు భవనం గ్రౌండ్ లెవల్ పనులు పూర్తైన క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.