రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎస్పీ కుటుంబ సభ్యులతో, రాజన్న కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కళ్యాణమండపంలో వేదోక్త ఆశీర్వదించి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.
KNR: ఇల్లంతకుంట మండలం నుంచి చలో హైదరాబాద్ తరలివెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుల పట్ల ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ఇస్తామన్న రూ.18 వేల వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెంలోని సీడబ్ల్యుఎస్ గ్రౌండ్‌లో జరిగిన మండల పాస్టర్స్ ఐక్య గ్లోరియస్ క్రిస్మస్ వేడుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి శాంతి కలుగజేసిన క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
KMM: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు అని అన్నారు.
KRNL: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిరివెళ్ల తహసీల్దార్ పుష్పకుమారి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని బోయలకుంట్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కృష్ణా: తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాసరావు మంగళవారం తాజా రాజ్యసభ అభ్యర్థులు మస్తాన్(టీడీపీ), సతీష్(టీడీపీ), కృషయ్య(బీజేపీ)లను కలిసి అభినందనలు తెలిపారు. ఈ ముగ్గురి నామినేషన్ సందర్భంగా అమరావతి అసెంబ్లీ హాలులో ఎమ్మెల్యే కలిశారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.
NDL: ఆర్థిక శాఖ మంత్రి, నంద్యాల జిల్లా ఇంఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం నంద్యాలకు వచ్చారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాలలోని R&B గెస్ట్ హౌస్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా.. మంత్రితో ఆళ్లగడ్డ అభివృద్ధి, సమస్యల గురించి చర్చించారు.
కృష్ణా: కోడూరు మండలంలో బెల్ట్ షాపులకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. మద్యం తరలిస్తున్న వాహనాన్ని, వ్యక్తిని అదుపులోనికి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మద్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
AP: వైజాగ్‌లో సంచలనం రేపిన జాయ్ జెమియా హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది. బాధితుల నుంచి డబ్బులు తీసుకొని విశాఖ సీపీ ఆమెను ఇరికించారని ఆరోపణలు చేశారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MNCL: రామగుండం కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 1 నుండి జనవరి 1 వరకు కొనసాగుతాయని తెలిపారు. అలాగే డీజే, డ్రోన్‌లపై నిషేధాజ్ఞలు పొడగిస్తున్నట్లు పేర్కొన్నారు.
AP: చంద్రబాబు ఒకే కుటుంబానికి పెద్దపీట వేస్తున్నారని మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బీసీలకు రాజ్యసభ స్థానాలను అమ్ముకున్నారని ఆరోపించారు. బీద మస్తాన్‌రావు రాజీనామా చేసి తిరిగి రాజ్యసభ సీటు కొనుకున్నారని చెప్పారు. సానా సతీష్ అనే క్రిమినల్‌కి రాజ్యసభ స్థానం ఇచ్చారని వ్యాఖ్యానించారు. సతీష్‌పై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని తెలిపారు.
నంద్యాల: మొదటిసారిగా నంద్యాల జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్‌కు జిల్లా ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్‌కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, అందరూ పూలతో స్వాగతం పలికారు. జిల్లాలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు.
KDP: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం సంబేపల్లి మండలం పీఎన్ కాలనీలో జరిగే రెవిన్యూ సదస్సులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘మీ భూమి-మీ హక్కు’ డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
WNP: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మొత్తం 260 గ్రామపంచాయతీలకు గాను 2,366 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ నిర్వహించిన “ఉచిత పశువైద్య శిబిరమం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో పశువుల ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నివారణ కోసం అవసరమైన వైద్య సేవలు మరియు సూచనలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మరియు పశువుల యజమానులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.