• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నంద్యాలలో ఘనంగా శివరామకృష్ణ జన్మదిన వేడుకలు

నంద్యాలలో గోళ్ళ రాజేష్ కార్యాలయంలో సీనియర్ పాత్రికేయుడు శివరామకృష్ణ (RK9 NEWS ఎడిటర్) జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భ ఇవాళ పలువురు పాత్రికేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉస్మాన్ భాష, మస్తాన్, నూర్ భాషా, కుమార్, శ్రీనివాసులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:50 AM IST

బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం

TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా వచ్చి పక్క రోడ్లోకి దూసుకెళ్లి కార్లు, బైకులను ఢీకొట్టింది. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 11:50 AM IST

కాజిపేటలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

హనుమకొండ జిల్లా కాజిపేట మండల కేంద్రలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పధకాలను శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత చేసిన పనులపై కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శ్రీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:48 AM IST

రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ

MBNR: జడ్చర్ల మండలంలోని 15 గ్రామాలకు చెందిన నూతన వార్డు సభ్యులకు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మొదటి బ్యాచ్ కింద ఆలూరు బూరుగుపల్లి, ఉదండాపూర్, చెర్లపల్లి సహా పలు తండాల ప్రతినిధులకు ఈ శిక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో పాలన, అధికారాలపై అవగాహన కల్పించడమే ఈ తరగతుల ముఖ్య ఉద్దేశం హాజరు కావాలని అధికారులు సూచించారు.

February 22, 2026 / 11:48 AM IST

జాతీయ సమైక్యత శిబిరానికి మైదుకూరు విద్యార్థి ఎంపిక

KDP: మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్ ఏ.బాలు, బెలగావిలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికయ్యారు. ఈ శిబిరంలో ఆయన YVU తరపున APకు ప్రాతినిధ్యం వహిస్తారు.ప్రిన్సిపాల్ డా.పి.నారాయణరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జాతీయ స్థాయిలో బాలు ఎంపిక కావడం పట్ల NSS పీవో డా. కృష్ణారెడ్డి,అధ్యాపకులు,విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 11:47 AM IST

కోట్ల వారి పల్లెలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

NDL: డోన్ పట్టణ పరిధిలో కోట్ల వారి పల్లెలో శ్రీ గంగ గంగమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన నేడు పాల్గొన్నారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

February 22, 2026 / 11:46 AM IST

కలికిరిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఘన నివాళి

అన్నమయ్య: రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా కలికిరిలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులి సత్యనారాయణరెడ్డి పాల్గొని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దుష్ట పాలనకు ఎదిరించి పోరాడిన వీరుడని తెలిపారు.

February 22, 2026 / 11:46 AM IST

ఎక్కువ రోజులు బతకాలంటే..!

✦ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి✦ ఒకేసారి ఎక్కువగా కాకుండా ఎక్కువసార్లు తిన్నా సరే కొంచెం కొంచెం తినాలి✦ మజ్జిగ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను తయారు చేస్తాయి✦ చికెన్, మటన్ బదులు చేపలు ఎక్కువగా తినాలి.✦ చక్కెర, ఉప్పు తగ్గించాలి. ఫలితంగా షుగర్, బీపీలకు దూరంగా ఉంటారు✦ రోజూ కనీసం 30 ని. పాటు వ్యాయామం చేయాలి 

February 22, 2026 / 11:46 AM IST

వీధి కుక్కలకు చర్మవ్యాధి.. ఆందోళనలో గ్రామస్థులు

NLG: కనగల్ మండలంలోని ధర్వేశిపురం, ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో వీధి కుక్కలు తీవ్రమైన చర్మవ్యాధితో కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వ్యర్థాల వల్ల సోకిన ఈ వ్యాధి మనుషులకు ప్రబలకుండా పశువైద్య అధికారులు తక్షణమే స్పందించి కుక్కలకు చికిత్స అందించాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

February 22, 2026 / 11:46 AM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

BHPL: రేగొండ మండల కేంద్రానికి చెందిన మైస వీరస్వామి ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రావణ్ సిద్దార్థ్ యూత్ ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి..రూ.5000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:46 AM IST

ఉయ్యాల జీవిత చరిత్ర యువతకు ఆదర్శం: JC

VZM: బ్రిటిష్ నిరంకుశ పాలనపై గర్జించిన తొలితరం స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ కొనియాడారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఆదివారం జరిపారు. అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా రైతులను ఏకం చేసి, ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప వీరుడు నరసింహారెడ్డి అని అన్నారు.

February 22, 2026 / 11:45 AM IST

‘ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీసుల బందోబస్తు’

ADB: కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ నాయకులు చలో కామారెడ్డి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యక్రమానికి బయలుదేరకుండా పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు, ప్రతి దాడులు సరైనవి కాదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.

February 22, 2026 / 11:45 AM IST

ఆకాశాన్నంటిన అడ్డపిక్క ధర

ASR: గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన అడ్డపిక్కల కొనుగోలుకు ప్రజలు అధికంగా మక్కువ చూపిస్తున్నారు. వీటిని గిరిజనులు, మైదాన ప్రాంతాల వారు కొనుగోలు చేస్తుంటారు. అల్లూరి జిల్లాలో జరిగే వారపు సంతలో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మూడు, నాలుగు కేజీలుండే ప్యాకెట్ ధర రూ.500 పలుకుతుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

February 22, 2026 / 11:44 AM IST

పొన్నూరులో పరదాల చాటున మద్యం దందా..!

గుంటూరు: పొన్నూరులో పరదాల మాటున మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీబీసీ రోడ్డులో బాపట్ల బస్టాండ్, ఆటో స్టాండ్ సమీప వైన్స్ షాపుల్లో తెల్లవారుజామునే అమ్మకాలు సాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 22, 2026 / 11:43 AM IST

రాజ్ తరుణ్ కోలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ఈ సినిమా వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలతో అలరించనుంది. ఇక ఈ సినిమాలో ఆరి అర్జున్, అమ్ము అభిరామి, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

February 22, 2026 / 11:42 AM IST