• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అభివృద్ధే లక్ష్యంగా సర్పంచుల శిక్షణ

SDPT: గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. తొలి విడతగా అక్కన్నపేట మండలానికి చెందిన 38 గ్రామపంచాయతీ సర్పంచులు శిక్షణను పూర్తి చేశారు. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు, పరిపాలన నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుంది.

February 22, 2026 / 10:37 AM IST

ప్రముఖులకు ‘రాఘవేంద్ర స్వామి ప్రశస్తి’ పురస్కారాలు

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులకు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ‘రాఘవేంద్ర స్వామి ప్రశస్తి’ అవార్డులను ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలలో రామకృష్ణ , అశ్వత్ నారాయణతోపాటు ప్రముఖ ఎమ్మిగనూరుకు చెందిన శక్తి నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ గౌడప్ప గౌడ, బళ్లారికి చెందిన డాక్టర్ సుధీర్ ఉన్నారు.

February 22, 2026 / 10:36 AM IST

జిల్లా ప్రధాన కార్యదర్శిగా పల్లి రాంబాబు

VZM: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పల్లి రాంబాబు నియమితులయ్యారు. విజయనగరం మండలం బడుకుండుపేట గ్రామానికి చెందిన రాంబాబు ఆ పార్టీ అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ చేతుల మీదుగా పదవి బాధ్యతలకు సంబంధించిన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈసందర్బంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

February 22, 2026 / 10:36 AM IST

శ్రీ లక్ష్మి సౌభాగ్య మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం

సత్యసాయి: కొత్తచెరువులో శ్రీ లక్ష్మి సౌభాగ్య మహిళా కోఆపరేటివ్ బ్యాంకును ఆర్డీటీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ డైరెక్టర్ విశాలా ఫెర్రర్ ప్రారంభించారు. కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల నుంచి సుమారు 800 మంది మహిళా సంఘ సభ్యులు హాజరయ్యారు. మహిళలే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా, యజమానులుగా ఉంటూ ఈ బ్యాంకును నిర్వహించనున్నారు.

February 22, 2026 / 10:33 AM IST

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పాట్నా హైకోర్టు న్యాయమూర్తి

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

February 22, 2026 / 10:33 AM IST

బెల్లంపల్లిలో ప్రారంభమైన గురుకుల పరీక్ష

మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహిస్తున్న పరీక్ష ప్రారంభమైంది. బెల్లంపల్లిలో మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు విద్యార్థులు తమ తమ హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు.

February 22, 2026 / 10:33 AM IST

T20 WC: సెమీస్‌లో భారత్-పాక్ తలపడితే?

T20 ప్రపంచకప్-2026లో భాగంగా సెమీస్‌లో భారత్-పాక్ తలపడితే ఆ మ్యాచ్ MAR 4న జరుగుతుంది. దేశమంతా హోలీ వేడుకల్లో ఉండగా.. శ్రీలంక గడ్డపై దాయాదుల పోరు ఉత్కంఠను పంచనుంది. ఒకవేళ పాక్ కాకుండా మరే ఇతర జట్టుతోనైనా భారత్ సెమీఫైనల్ అడితే ఆ మ్యాచ్ ముందుగా నిర్ణయించినట్లే MAR 5న ముంబైలోనే జరగనుంది. ఈ నిబంధనల ప్రకారం పాక్ ఆడే తొలి సెమీస్ కూడా కోల్‌కతా నుంచి కొలంబోకు మారుతుంది.

February 22, 2026 / 10:33 AM IST

మేడిపల్లిలో “Run For A Drug-Free Life” అవగాహన రన్

MDCL: మత్తు పదార్థాల బారిన పడుతున్న యువతను రక్షించాలనే లక్ష్యంతో మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోని నారపల్లి నందనవనంలో “Run For A Drug-Free Life” అవగాహన రన్ నిర్వహించారు. శాంతివనం రన్నర్స్, మెడిపల్లి ఆధ్వర్యంలో HYD రన్నర్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం యువతలో విశేష స్పందన లభించింది. ఈ రన్‌‌ను జక్క వెంకట్ రెడ్డి, తుంగతుర్తి రవిలు ప్రారంభించారు.

February 22, 2026 / 10:32 AM IST

నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ అవకాశాలు

PDPL: రీజినల్ టాస్క్ సెంటర్‌లో నిరుద్యోగ యువత ఉచిత శిక్షణ పొందే అవకాశాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష గుర్తించారు. ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలోని సెంటర్‌లో జావా, పైథాన్, సీ, సీ++, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్‌టి, మెడికల్ కోడింగ్, ఆప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సులు ఉచితంగా నిర్వహించబడతాయి. ఫిబ్రవరి 28 లోపు నమోదు చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 10:31 AM IST

చినపారుపూడిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

కృష్ణా: మానవత్వంతో పేదలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. పెదపారుపూడి మండలం చినపారుపూడి గ్రామంలో శ్యామల రాజు కుటుంబానికి మంజూరైన రూ. 1,64,543 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును వారి గృహానికి వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 10:31 AM IST

శ్రీ కొత్తమ్మ తల్లి ధర్మాదాయ హుండీ లెక్కింపు 27న

SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ధర్మాదాయ హుండీ లెక్కింపు ఫిబ్రవరి 27 న ఆలయం ప్రాంగణంలో జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాకచర్ల రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆలయం పాలకమండలి ఆలయం భక్తులు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుందన్నారు.

February 22, 2026 / 10:30 AM IST

రూ. 91 లక్షల బకాయి.. 3 దుకాణాలు సీజ్

నెల్లూరు నగరపాలక సంస్థకు అద్దె, రెన్యువల్ బకాయిలు చెల్లించని కారణంగా కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు శనివారం అధికారులు 3 దుకాణాలను సీజ్ చేశారు. ప్రకాశం పంతులు కాంప్లెక్స్‌లో షాప్ నం. 8 (రూ. 24.55 లక్షలు), ఏ.సి. బొమ్మ కాంప్లెక్స్‌లో షాప్ నం. 9, 10 బకాయిలు ఉండటంతో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.

February 22, 2026 / 10:30 AM IST

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామం రాళ్ళరేవు హైస్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రధానంగా మధుమేహం, గుండె ఎముకలు, ఊపిరితిత్తులు, దంత, స్త్రీల ప్రసూతి, జనరల్ సర్జరీ, జనరల్ వ్యాధులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.

February 22, 2026 / 10:30 AM IST

క్రికెట్ ఆడిన మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి

ATP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ్యాపీ సండే కార్యక్రమం గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. అనంతరం ఆమె కాసేపు క్రికెట, బ్యాట్మెంటన్ ఆటలను ఆడారు. కమిషనర్ మాట్లాడుతూ.. జీవితంలోని పని ఒత్తిడిని పక్కనపెట్టి ‘హ్యాపీ సండే’ను ఒక ఆనందం వేదికగా మార్చుకుందామని ప్రజలకు సూచించారు.

February 22, 2026 / 10:30 AM IST

మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు తెలంగాణ SIB ఎదుట లొంగిపోయారు. వీరిలో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీతో పాటు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఉన్నారు. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరి లొంగుబాటు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో వీరిని పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

February 22, 2026 / 10:27 AM IST