• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అతి పెద్ద మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

E.G: కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామానికి చెందిన మహమ్మద్ జరీనాకు రూ. 1,55,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల, వెంకటలక్ష్మి శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ సిఫార్సు మేరకు ఈ చెక్కు అందించడం జరిగింది అన్నారు.

February 20, 2026 / 12:34 PM IST

‘ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సంస్థకే కేటాయించాలి’

ప్రకాశం: ఆర్టీసీ గ్యారేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనిగిరి ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఎస్డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమస్త కేటాయించాలని, గ్యారేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 12:32 PM IST

ఆకివీడు నుంచి అసెంబ్లీ సందర్శనకు విద్యార్థులు

W.G: ఆకివీడులోని విద్యార్థులు అసెంబ్లీ సందర్శించేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌కు, సరోజినీ నాయుడు బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. స్థానిక హై స్కూల్ వద్ద బస్సులో విద్యార్థులు ఎక్కించి కూటమి నాయకులు జండా ఊపి ప్రారంభించారు.

February 20, 2026 / 12:32 PM IST

ఆలయాన్ని సందర్శించిన ఛైర్మన్

BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం కాసేపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో ఛైర్మన్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

February 20, 2026 / 12:32 PM IST

‘ఎమ్మెల్యే బడేటి ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమం’

ELR: ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని బడేటి చంటి శుక్రవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి ప్రాధాన్యత నిస్తూ కృషి చేస్తున్నామన్నారు. క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన ప్రజలు నిరాశతో వెళ్లకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఉదయాన్నే వినతులు స్వీకరించామన్నారు.

February 20, 2026 / 12:32 PM IST

‘పశు వైద్యశాల నూతన భవనం నిర్మించండి’

BDK: జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పశు వైద్యశాల శిథిలావస్థకు చేరింది. దీంతో పశు వైద్య సిబ్బంది పశువులను తీసుకొచ్చిన రైతులు లోపలికి వెళ్లాలంటే భయపడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పశు వైద్యశాలను తొలగించి నూతన పశువైద్యశాలను నిర్మించాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు.

February 20, 2026 / 12:31 PM IST

దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని నిర్మించిన నూతన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఈ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, నిత్యపూజల కోసం రూ. 2.లక్షల విరాళం అందజేశారు.

February 20, 2026 / 12:31 PM IST

‘అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’

MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని జన్నారం మండలం ఎంపీవో జలంధర్ సూచించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది. పలు విషయాలను వార్డు సభ్యులకు ఎంపీవో వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 12:30 PM IST

ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి: గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని TDP నాయకులు గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ MLA కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

February 20, 2026 / 12:30 PM IST

గుంటూరు రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుంటూరు రైల్వే స్టేషన్‌లోని 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్ ట్రాక్‌పై శుక్రవారం ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైలు ఢీకొనడం వల్లే సుమారు 35 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మెరూన్, తెల్ల రంగు బొమ్మలున్న చొక్కా ధరించి ఉన్నదని ఆచూకీ తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

February 20, 2026 / 12:30 PM IST

గోదావరి జలాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే

SDPT: జిల్లా రాయపోల్ మండలం మంతూర్–అనాజీపూర్ శివారులో 13డి కాలువలో గోదావరి జలాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్యతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం నీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా చూసుకోలేకపోతుందన్నారు.

February 20, 2026 / 12:29 PM IST

భూతగాడ కేసులో నిందిత దంపతులకు 7 ఏళ్ల జైలు శిక్ష

BHPL: భూతగాడ నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో గొర్లవీడు గ్రామానికి చెందిన మామిడి రాజకుమార్, అతని భార్య రమను దోషులుగా నిర్ధారించిన జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులిద్దరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ఇద్దరికీ చెరో రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 10 వేల జరిమానా విధించినట్లు ఇవాళ SP సంకీర్త్ తెలిపారు.

February 20, 2026 / 12:29 PM IST

రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన MLA

ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను MLA పాయల్ శంకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో స్రవంతితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రనమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

February 20, 2026 / 12:29 PM IST

స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్

NLG: దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే రూ.8500 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 12:27 PM IST

రామారెడ్డి PHC నీ సందర్శించిన ఫుడ్ కమిషన్ ఛైర్మన్

KMR: రామారెడ్డి PHC నీ ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన వెంట DMHO డా.విద్య ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల, బాలింతల పట్ల తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్య శాఖ సమన్వయంతో అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీషన్ ఫుడ్ అందిస్తున్న సేవల వివరాలపై ఆరా తీశారు.

February 20, 2026 / 12:26 PM IST