• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి’

ADB: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు రాందాస్, సంతోష్ రావు, అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 08:04 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ MLA

BHPL: రేగొండ మండలం రామన్నగూడెం తండాకు చెందిన గుగులోతు వీరునాయక్ -శాంతి కుమార్తె ఉమా – విజేందర్ వివాహ మహోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.

February 21, 2026 / 08:04 PM IST

పాక్-కివీస్ పోరుకు వర్షం అంతరాయం

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాగా, వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. దాదాపు ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, రెండు జట్లు చెరో పాయింట్‌ను పంచుకుంటాయి.

February 21, 2026 / 08:03 PM IST

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 22,303 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.

February 21, 2026 / 08:03 PM IST

మీసేవ మొబైల్ యాప్‌పై జిల్లాస్థాయి శిక్షణ

BDK: జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా శనివారం కొత్తగూడెం జిల్లాలోని నయాబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జీపీవోలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించబడింది.

February 21, 2026 / 08:02 PM IST

‘సీఎం, మంత్రుల పర్యటనతో రైతులకు ఒరిగేది ఏమీ లేదు’

WGL: జిల్లాలో సీఎం, మంత్రుల పర్యటనలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. HNK పట్టణ కేంద్రంలోని BRS కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి 2 రెండేళ్లు గడిచిన ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:02 PM IST

ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ATP: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పీ. జగదీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, శాంతిభద్రతల పరిస్థితులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో క్రైమ్ రేట్ తగ్గించాలని సూచించారు.

February 21, 2026 / 08:02 PM IST

గృహప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే

SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:01 PM IST

‘ప్రజాదర్బార్’ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల ప్రజల ముంగిటకే పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఇబ్బందులను ఆమె స్వయంగా వింటూ, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 08:01 PM IST

బీజేపీలో చేరిన ABVP పూర్వ విద్యార్థి నాయకుడు

W.G: తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఏబీవీపీ పూర్వ విద్యార్థి నాయకుడు మంగుతుర్తి మెహెర్ రాజ్ శనివారం బీజేపీలో చేరారు. భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని మంత్రి శ్రీనివాస్ వర్మ సూచించారు. మోదీ నాయకత్వంలో సుసంపన్నమైన పాలన ప్రజలకు లభిస్తుందన్నారు.

February 21, 2026 / 08:00 PM IST

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

KDP: పోట్లదుర్తి సమీపంలోని పెన్నా రివర్ వద్ద గుర్తుతెలియని పెళ్లయిన మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యగా అంచనా. మెరూన్ రెడ్ కలర్ ఓని,బ్లాక్ కలర్ లెగ్గిన్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి మృతురాలి గుర్తింపునకు చర్యలు చేపట్టారు.

February 21, 2026 / 08:00 PM IST

ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి

NDL: కోయిలకుంట్ల పట్టణంలోని సంతపేటలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. వేసవిలో ఉచిత మంచినీటిని ప్రజలకు అందించడమే తమ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.

February 21, 2026 / 08:00 PM IST

డోన్లో బైక్–ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి

NDL: డోన్ పట్టణంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని నయారా పెట్రోల్ పంపు వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో ఆలంకొండకు చెందిన మునిరంగడు (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు,కొడుకు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 08:00 PM IST

వైసీపీ దుశ్చర్యలను ఖండించిన ఎమ్మెల్యే

ELR: వైసీపీ సభ్యులు కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను రాజకీయ ప్రదర్శనలకు వినియోగించడం అత్యంత దురదృష్టకరమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. శనివారం ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దేవుడి పేరును రాజకీయ లాభాల కోసం వినియోగించడం హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీయడమేనని అన్నారు.

February 21, 2026 / 08:00 PM IST

గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం

E.G: చాగల్లు గ్రామ పంచాయతీలో గృహ నిర్మాణ ప్రగతిపై పీడీ హౌసింగ్ నాతి బుజ్జి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ఉగాది నాటికి పూర్తి చేయాల్సిన 417 గృహాల నిర్మాణంపై ఆమె సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సమయానికి పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 08:00 PM IST