• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాల వ్యాపారులకు లైసెన్స్ ఇవ్వాలి: కామన

E.G: అన్ని పాల కేంద్రాలను, ప్రతి గ్రామంలో ఉన్న పాల వ్యాపారాలు చేసే వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వాలని గ్రామ పంచాయతీ పరిధిలో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు డిమాండ్ చేశారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు.

February 24, 2026 / 06:30 PM IST

అన్నపురెడ్డి రాణికి అరుదైన గౌరవం

కడప: జిల్లా మహిళా చైర్ పర్సన్ అన్నపురెడ్డి రాణికి అరుదైన గౌరవం దక్కింది. ఆమె చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి, తెలంగాణ ఆదర్శ కళావేదిక ఫిలిం సంస్థ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెను సన్మానించింది. ఈ సందర్భంగా మరికొందరు గౌరవ అతిథుల చేతుల మీదుగా ఆమెకు నంది అవార్డును అందజేశారు.

February 24, 2026 / 06:28 PM IST

‘ది కేరళ స్టోరీ-2’పై కోర్టు కీలక తీర్పు

‘ది కేరళ స్టోరీ-2’ టీజర్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ చిత్ర కథనం ఉందంటూ టీజర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. టీజర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. దీంతో టీజర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

February 24, 2026 / 06:27 PM IST

అసెంబ్లీని సందర్శించిన కళాశాల విద్యార్థులు

W.G: దుంపగడపలో వీవీ గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సందర్శించారు. 60 మంది విద్యార్థులు, అరుగురు అధ్యాపకులు గ్యాలరీ నుంచి సభా చర్చలను ప్రత్యక్షంగా వీక్షించి, శాసనసభ పనితీరుపై అవగాహన పెంచుకున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులను కలిసి అసెంబ్లీ నిర్వహణ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

February 24, 2026 / 06:26 PM IST

తెలంగాణ పోలీస్ క్రీడల్లో ఆసిఫాబాద్ పోలీసుల పతకాల వర్షం

ASF: పోలీస్ క్రీడల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన నాల్గవ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసులకు పలు పతకాలు లభించాయి. సెపక్ తక్రాలో పొట్ట గోపి బృందం సిల్వర్ సాధించగా, మహిళల బాడ్మింటన్‌లో సువార్త సిల్వర్ గెలుచుకుంది. బాక్సింగ్‌లో పూల్ సింగ్ సిల్వర్, టైక్వాండోలో పూల్ సింగ్, వినయ్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు.

February 24, 2026 / 06:26 PM IST

మార్చి 14న జాతీయ లోక్ అదాలత్

NTR: నందిగామలో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ జరుగునుందని 16వ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీని ద్వారా ఎప్పటి నుంచో రాజీ పడని కేసులలో కక్షిదారులు సత్వరమే రాజీ చేసుకోవచ్చు అన్నారు. దీని ద్వారా డబ్బు సమయం అవుతూ కక్షిదారుల మధ్య స్నేహ సంబంధం కలుగుతుందని పేర్కొన్నారు. రాజీమార్గమే రాజమార్గం అని సూచించారు.

February 24, 2026 / 06:25 PM IST

డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు: ఏస్పీ

కర్నూలు: ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు నిరుద్యోగ యువత నుంచి డబ్బులు తీసుకొని మోసాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుతున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 24, 2026 / 06:24 PM IST

డ్రగ్స్ సరఫరా.. పలువురు అరెస్ట్

TG: ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు, ఏడుగురు వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈగల్ బృందం, జగదిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. మూసాపేట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 06:24 PM IST

మంత్రిని కలసిన ఎస్.కోట ఎమ్మెల్యే

VZM: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్ధనరెడ్డిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పలు రోడ్ల అభివృద్ధి, మరమ్మతులపై ఆయనతో చర్చించారు. అలాగే, రోడ్ల విస్తరణ పనులకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

February 24, 2026 / 06:23 PM IST

‘తిరుమల పవిత్రతను కాపాడాలి’

కృష్ణా: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరిగిందని MLA యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు క్షమించరానివని అన్నారు. స్వామివారి నైవేద్యంలో కల్తీపై గత పాలకుల పాత్రపై విచారణ జరపాలని, తిరుమల తిరుపతి దేవస్థానాలు స్వయంగా ఆవులను పెంచి నెయ్యి చేయాలని సూచించారు.

February 24, 2026 / 06:23 PM IST

అన్న క్యాంటీన్ల నిర్వహణలో రాజీ వద్దు

BPT: అన్న క్యాంటీన్ నిర్వహణపై మంగళవారం ట్రస్ట్ సీఈవో వాసుదేవ్ సమీక్షించారు. పేదలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలన్నారు. ఇటీవలి సర్వేలో ఇక్కడి సేవలపై 91 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే ప్రమాణాలు కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. నాణ్యత, పరిశుభ్రతలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 24, 2026 / 06:20 PM IST

క్రమశిక్షణతో కూడిన డ్రైవింగే ప్రాణాలకు రక్షణ: ఎస్పీ

SRPT: మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేటలో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాణకవచాలని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రమాద బాధితులను కాపాడి ‘రహదారి హీరోలు’ కావాలని పిలుపునిచ్చారు.

February 24, 2026 / 06:20 PM IST

ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

E.G: రాజమండ్రిలో గణేశ్వరరావు నుంచి కొనుగోలు చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులను వినియోగించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం స్పష్టం చేశారు. అతడు సరఫరా చేసిన పాలు కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. ఈ పాలు, వాటి ద్వారా తయారైన పెరుగు, కోవా, నెయ్యి, మీగడ వంటి పదార్థాలు ఎక్కడ నిల్వ ఉన్నా వెంటనే తొలగించి, సురక్షితంగా నాశనం చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 06:20 PM IST

‘చేనేత రుణమాఫీని అమలు చేయాలి’

NLG: చేనేత కార్మికుల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం ప్రకటించి 20 నెలలైనా హామీ నెరవేరలేదని, పొదుపు పథకం నిధులు విడుదల చేయాలని కోరారు. షరతులు లేకుండా చేనేత భరోసా, పెండింగ్‌లో ఉన్న నేతన్న బీమా చెల్లించాలన్నారు.

February 24, 2026 / 06:19 PM IST

కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. తప్పిన ప్రమాదం

ATP: శింగనమల మండల కేంద్రంలోని శివపురం పెద్దమ్మ గుడి వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి తార్పర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 06:19 PM IST