• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంత్రి లోకేష్ పనితీరుపై హైకోర్టు ప్రశంస

AP: మంత్రి లోకేష్ పనితీరును హైకోర్టు ప్రశంసించింది. కస్తూర్బా పాఠశాలల టీచర్ల జీతం పెంచుతామన్న ప్రకటనను అభినందించింది. పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన చేశారని వ్యాఖ్యానించింది. ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని తెలిపింది. హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై వెంటనే స్పందించారని హైకోర్టు కితాబిచ్చింది.

February 24, 2026 / 06:15 PM IST

కోట్ల మోసం.. హోంశాఖ కీలక ఆదేశాలు..!

NDL: ఆళ్లగడ్డలో నిరుద్యోగులను మోసగించిన ‘ఓ సొల్యూషన్ స్కీమ్’ సంస్థపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉద్యోగాల పేరుతో రూ. 35 కోట్లు వసూలు చేసిన నిర్వాహకుల ఆస్తులను జప్తు చేస్తూ మంగళవారం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు బాధితుల సొమ్ముతో కొనుగోలు చేసిన స్థిర, చరాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.

February 24, 2026 / 06:12 PM IST

వైద్యుల నిర్లక్ష్యం.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

MHBD: మహబూబాబాద్ పట్టణంలోని పోనుగోడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట రోగి మంగళవారం బంధువులు రాస్తారోకో నిర్వహించారు. గర్భాశయ గడ్డ శస్త్రచికిత్సలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మూత్రనాళాలు దెబ్బతిని రోగి పరిస్థితి విషమించిందని వారు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:12 PM IST

కాశినాయన క్షేత్రం కూల్చింది ఎవరు?: పేర్నినాని

AP: జగన్ హయాంలో ఆలయాలపై దాడులకు రాజకీయ లబ్ధి వచ్చేది ఎవరికి? అని మాజీమంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ‘2014-19 మధ్య విజయవాడలో ఆలయాలు కూలగొట్టారు. హిందూ మతం పట్ల గౌరవం ఉంటే ఆలయాలు కూలుస్తారా? కూటమి ప్రభుత్వం వచ్చాక కాశినాయన క్షేత్రం కూల్చింది ఎవరు? శ్రీకాకుళం కూర్మలో ఆలయానికి నిప్పు పెట్టింది ఎవరు’ అని పేర్నినాని నిలదీశారు.

February 24, 2026 / 06:12 PM IST

పవర్ గ్రిడ్ చర్యలపై ఆవేదన..!

KDP: వియన్‌పల్లె మండలం ఐ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు శివ నాగేశ్వర్ రెడ్డి చీని తోటలో పవర్ గ్రిడ్ సిబ్బంది తన అనుమతి లేకుండా చెట్లు తొలగించారని ఆరోపిస్తూ మహిళలతో కలిసి నిరసన తెలిపారు. చిన్న పిల్లలలా పెంచుకున్న చెట్లను నష్టపరిహారం లేకుండా పీకివేయడం బాధాకరమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం పై అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని కోరారు.

February 24, 2026 / 06:11 PM IST

‘సొంత అంగన్‌వాడీ భవనాలు నిర్మించాలి’

వనపర్తి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆధ్వర్యంలో సొంత అంగన్‌వాడీ భవనాలు నిర్మించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో అవసరమైన నిత్యవసర వస్తువులను మంజూరు చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

February 24, 2026 / 06:11 PM IST

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: కే.కే. రాజు

VSP: పదవులు పొందిన ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. జిల్లాలో నూతనంగా నియమితులైన వివిధ విభాగాల నాయకులు కేకే రాజును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 06:11 PM IST

మహిళల భద్రతపై శక్తి టీం విస్తృత అవగాహన

సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీం బృందాలు మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. పాఠశాల విద్యార్థినులు, రద్దీ ప్రాంతాల్లోని మహిళలు, పొలాల్లో పనిచేసే కూలీలకు రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, వేధింపులు వంటి ఘటనలు ఎదురైతే సహించకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

February 24, 2026 / 06:10 PM IST

నాటుసారా సీజ్ చేశాం: ఎక్సైజ్ సీఐ

NDL: 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని స్వాధీనం చేసుకున్నట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మిడుతూరు(M ) కాజీపేట వద్ద దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడులలో గడివేముల (M) లక్ష్మయ్య కుంట తండాకు చెందిన ఓ వ్యక్తి వద్ద 5 లీటర్లు, అల్లూరులో ఓ మహిళ వద్ద 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని సీజ్ చేసామన్నారు.

February 24, 2026 / 06:10 PM IST

సుందరీకరణ పనులను పరిశీలించిన ఉద్యానవన అధికారి

KMM: ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా ఉద్యానవన శాఖాధికారి పరిశీలించారు. మొక్కల కత్తిరింపు, ఇతర నిర్వహణ పనులను పర్యవేక్షించిన ఆయన, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.

February 24, 2026 / 06:09 PM IST

రంజీ ఫైనల్: తొలి రోజే జమ్మూకశ్మీర్ భారీ స్కోరు

కర్ణాటక, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 284/2 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాటర్ ఇక్బాల్(6) త్వరగానే అవుటైనప్పటికీ.. మరో ఓపెనర్ హసన్(88) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్ డౌన్ బ్యాటర్ శుభం పుండిర్(117) సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో డోగ్రా(9), అబ్దుల్ సమద్ (52) ఉన్నారు.

February 24, 2026 / 06:08 PM IST

రాష్ట్ర సమగ్రాభివృద్ధికే క్యూర్-ప్యూర్-రేర్: శ్రీధర్ బాబు

TG: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రోత్ ఎక్స్ సదస్సులో పాల్గొన్నారు. త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.O ప్రారంభిస్తమన్నారు. ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడిపించాలన్నదే అజెండా అని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికే క్యూర్-ప్యూర్-రేర్ తీసుకొచ్చామని తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మార్చాలనేదే లక్ష్యం అని వెల్లడించారు.

February 24, 2026 / 06:08 PM IST

జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం పోచారం‌లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీనియర్ నాయకులు బిక్షపతి, శ్రీశైలం గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

February 24, 2026 / 06:08 PM IST

ఆదోనిలో దేవాలయ భూమి కబ్జా ఆరోపణలు

KRNL: ఆదోని శుక్రవారం పేటలో సర్వే నంబర్ 315లోని 4 ఎకరాలు 2 సెంట్ల దేవాలయ భూమిని వైసీపీ నాయకుడు రఘునాథ్ అక్రమంగా కబ్జా చేశారని ఇవాళ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ నార్త్ మండలం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దేవాలయ ఆస్తులను రక్షించి భూమిని తిరిగి ప్రజలకు అప్పగించాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.

February 24, 2026 / 06:07 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ

BDK: కొత్తగూడెం క్లబ్ నందు విద్యార్థిని, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎవరైనా గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.

February 24, 2026 / 06:06 PM IST