ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu).. త్రివిక్రమ్ దర్శకత్వంలో 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ ప్రాజెక్ట్. అయితే అనుకోకుండా మహేష్ తల్లి ఇందిరా దేవి ఆకస్మిక మరణం.. మహేష్‌ను కలిచివేసింది. అందుకే కొన్ని రోజులు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చాడు. త్రివిక్రమ్ కూడా మహేష్‌ను డిస్టర్బ్ చేయలేదు.
ఈ క్రమంలోనే కొడుకు గౌతమ్ కోసం లండన్‌కు వెళ్లాడు మహేష్. కొన్ని రోజులు లండన్‌లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసిన మహేష్.. తాజాగా ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ లండన్ ట్రిప్ నుంచి రిటర్న్ అవడంతో.. ఎస్ఎస్ఎంబీ 28 సెకండ్ షెడ్యూల్లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ షెడ్యూల్ నవంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవనుందని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో.. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ఎస్ఎస్ఎంబీ 28ని రిలీజ్ చేయనున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో త్రివిక్రమ్ ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఆ స్పెషల్ ఐటెంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి స్టెప్పులు వేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.