ఐఐటీలో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగింది. ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా నలుగురు ఫ్రెండ్స్‌కు షేర్ చేశారని పోలీసులు గుర్తించారు. సదరు విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Smart Copy: ఐఐటీల్లో (IIT) బీటెక్ (B.TECH) సీట్ల భర్తీ కోసం దేశవ్యాప్తంగా ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ (Smart Copying) జరిగిందనే విషయం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్‌లో (Secunderabad) గల ఎస్వీఐటీ సెంటర్లో కాపీయింగ్ జరగగా.. ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎస్వీఐటీ (SVIT) సెంటర్లో చింతపల్లి చైతన్య కృష్ణ (Krishna Chaitanya) అనే విద్యార్థి తాను రాసిన జవాబులను వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. నలుగురు విద్యార్థులకు జవాబులు పంపించారని పోలీసులు గుర్తించారు. ఆ నలుగురు కూడా హైదరాబాద్ (hyderabad) పరిధిలో మిగతా సెంటర్లలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాస్తున్నవారే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో గల 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం కోసం బీటెక్ (B.TECH) సీట్ల భర్తీ కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. ఆన్ లైన్ విధానంలో పరీక్ష జరగగా.. తెలుగు రాష్ట్రాల నుంచి 35 వేల మంది హాజరయ్యారు. కటాఫ్ మార్కులు దాదాపు 60గా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఐఐటీలో (IIT) సీటును విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. రేయింబవళ్లు చదువుతుంటారు. కొన్ని స్కూళ్లలో ఐదో తరగతి నుంచే ఐఐటీల్లో సబ్జెక్ట్స్ బోధిస్తున్నారు. ఐఐటీలో చదివితే.. మంచి కంపెనీలు, భారీ ఆఫర్‌తో జీతం లభిస్తోంది. ఇండియా లేదంటే.. అబ్రాడ్ వెళ్లేందుకు మంచి అవకాశాలు ఉంటాయి. ఐఐటీలో చదవమని విద్యార్థులను పేరంట్స్ కూడా ఒత్తిడి చేస్తుంటారు.