»Janasena Activists Make Pawan Kalyan Cm Name Board In Nellore Andhra Pradesh
Janasena : పవన్ కళ్యాణ్ సీఎం అంటూ… శిలాఫలకాలను రెడీ చేసిన కార్యకర్తలు
ముఖ్యమంత్రి అయ్యాక పనులు పూర్తి చేస్తాం, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి హోదాను చేర్చి పవన్ కళ్యాన్ పేరుతో శిలాఫలకాలను తయారు చేయిస్తున్నారు జనసేన కార్యకర్తలు.
జనసేన ( Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేయబోతున్నట్లు అభివృద్ది పనుల శిలాఫలకాలను ఏర్పాటు చేశాడు ఓ కార్యకర్త. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా నిజమే. ఆంధ్ర ప్రదేశ్ ( Andhra Pradesh ) నెల్లూరు నియోజకవర్గానికి చెందిన సర్వేపల్లి కాలువపై మినిబైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడానికి శిలాఫలకాన్ని ఏర్పటుచేశాడు.
“ఈ నిర్మాణ పనులు రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పటు కాబడే ప్రజా ప్రభుత్వంలో ఎటువంటి ఆలస్యం లేకుండా పనులు పూర్తి చేయబడును.” అని శిలాఫలకంపై రాయించారు. శంకుస్థాపన చేయించే వారిగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీ నెల్లూరు అర్బన్ నియోజకవర్గం అని ఉంది. ముఖ్యమంత్రి పేరు స్థానంలో పవన్ కళ్యాణ్ పేరును ఉంచారు.
ఇలాంటి ఆలోచనలు కొందరికి ఎలా వస్తాయో అని ఆశ్యర్చపోతున్నారు జనాలు. రాజకీయాలు మరీ ఇంత చులకన అయ్యాయా అని అనుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతో జతకడుతుందో తెలియదని ముందు ఆవిషయంపై స్పష్టత ఉండాలని ఆ పార్టీ కార్యకర్తలకు హితవుపలుకుతున్నారు.
గతంలో భీమవరం (Bhimavaram), గాజువాక (Gajuwaka) రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ ఈసారి ఎక్కడి నుంచి పోటీచేస్తారో ప్రజలకు ముందుగా తెలియపరచాలని అంటున్నారు. కూటమిలో జనసేనకు సీఎం అభ్యర్థిత్వానికి మిగితా పార్టీలు అవకాశం ఇస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. అటు చంద్రబాబు ఉండగా పవన్ కు చాన్స్ వస్తుందా అని అనుకుంటున్నారు. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేక జనసేన బీజేపీలు మాత్రమే కలిసి పోటీ చేస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటిపై స్పష్టత లేనిదే పవన్ ను ముఖ్యమంత్రి అని శిలాఫలకాలు తయారు చేసుకోవడం నవ్వు కలిగించే విషయమని అంటున్నారు.