గాలి జనార్థన్ రెడ్డి… మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే… ఈసారి ఆయన తన భార్యను కూడా రంగంలోకి దించుతున్నారు. గతంలో బీజేపీతో కలిసి నడిచిన ఆ తర్వాత… ఆ పార్టీతో విబేధించి కల్యాణ రాజ్యప్రగతి పక్ష పేరిట కొత్త పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఆయన పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
గాలి జనార్దనరెడ్డి బళ్లారి, కొప్పళ జిల్లాల్లో అన్ని చోట్లా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బళ్లారి సిటీ నుంచి తన సతీమణి అరుణలక్ష్మిని బరిలోకి దింపుతానని ఆయన ప్రకటించారు. ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగిస్తోంది. బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి (బీజేపీ) స్వయానా గాలి జనార్దనరెడ్డి సోదరుడే. జనార్దనరెడ్డి ప్రకటనపై స్పందించేందుకు సోమశేఖరెడ్డి నిరాకరించడం గమనార్హం.