ఐఫోన్ (iPhone) కొనడం కొందరికి అందని ద్రాక్షనే. ఎందుకంటే ఆ ఫోన్ రేటు ఎక్కువ. కాకపోతే ఇతర ఫోన్లతో పోలిస్తే లుకింగ్‌తో పాటు, టెక్నాలజీ పరంగా ఐఫోన్లు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. అందుకే ఖరీదైనా సరే ఆ ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు మొగ్గు చూపుతుంటారు.టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ(Apple Company)కి చెందిన నయా ఐఫోన్ వస్తోందంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు .ప్రతీ ఏడాది సెప్టెంబరు(September)లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లో యాపిల్ ఈ సందడి ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ తన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్‌షిప్‌లను లాంచ్‌లపై భారీ అంచనాలే ఉన్నాయి.
ముఖ్యంగా రానున్న ఐఫోన్ 15 లాంచింగ్ డేట్ లీక్అయింది. తాజా లీక్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో ,ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందో తేదీ బహిర్గతమైంది. సాధారణంగా ఈ ఈవెంట్ (Event)ను తేదీని యాపిల్ లీక్‌కాకుండా చివరి గంట వరకూ ఉత్కంఠ రేపుతుంది.తాజా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 13న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.సరఫరా సమస్యల కారణంగా ఐఫోన్ 14 ప్లస్ విక్రయాలు గత ఏడాది అక్టోబర్ 7న ప్రారంభమయ్యాయి. 2020లో ఐఫోన్ 12 Pro Max, ఐఫోన్12 mini లాంచింగ్ లేట్ అయింది. ఈ ఏడాది సేల్ కూడా ఐఫోన్ 15 మోడల్‌లు “తీవ్రమైన కొరత” కారణంగా ఆలస్యం కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు అన్ని కొత్త మోడళ్ల (New models) అమ్మకాలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని అంచనా