TG: మాజీమంత్రి హరీష్ రావు లండన్ పర్యటన ముగించుకుని ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCRతో భేటీ కానున్నారు. ఇటీవల ఆయనపై కవిత చేసిన ఆరోపణలపై ఆయనతో హరీష్ రావు చర్చిస్తారని తెలుస్తోంది. KCRతో మాట్లాడిన తర్వాతే.. కవిత ఆరోపణలపై స్పందించే అవకాశం ఉంది. కాగా, ఈ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.