TG: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట ముగిసింది. రూ.1,116తో ప్రారంభమైన వేలం పాట.. ఉత్కంఠభరితంగా సాగింది. చివరకి కర్మన్ ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ అనే భక్తుడు రూ.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. సామ ప్రణీత్ రెడ్డి, లింగాల దశరథ్ గౌడ్ మధ్య తీవ్ర పోటీ సాగింది. చివరికి లడ్డూ దశరథ్ గౌడ్ సొంతం అయింది.