ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన పలు గణపతి మండపాలను సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు MLA ని శాలువాతో సత్కరించారు. నిమజ్జనం సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.