TG: ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సచివాలయ సమీపానికి పార్వతీ పుత్రుడు చేరుకున్నాడు. మహాగణపతికి భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. జైజై గణేశా అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరికాసేపట్లో నెక్లెస్ రోడ్ క్రేన్ నంబర్ 4 వద్దకు వెళ్లనున్నాడు. అక్కడ పూజా కార్యక్రమాల అనంతరం బడా గణేశుడిని నిమజ్జనం చేస్తారు.