కృష్ణా: గుడివాడలో శ్రీ భీమేశ్వర దేవాలయంలో జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాల.. ఆహ్వాన పత్రికలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయంలో జరగనున్న నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను ఈవో కందుల గోపాలరావు ఎమ్మెల్యేకు వివరించారు.