NLG: మిర్యాలగూడకు చెందిన రిపోర్టర్ దండ భాస్కర్‌కు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నివాళులర్పించారు. భాస్కర్ అకాల మరణం బాధాకరమని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తక్షణం సహాయం కింద రూ.50 వేల నగదును అందజేశారు. భాస్కర్ ఇద్దరూ ఆడపిల్లల భవిష్యత్తు కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.