KMR: గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు శనివారం 11వ రోజు గంగమ్మ ఒడిలోకి చేరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం మహిళలు యూత్ అమ్మాయిల కోలాటలు డ్యాన్సులతో ప్రజలకు ఆకట్టుకున్నాయి. 11 రోజులపాటు పూజలు అందుకున్న గణనాథులు శనివారం ఆటపాటలతో మండల కేంద్రంలో ఊరేగింపుగా మైసమ్మ చెరువుకు చేరుకొని గంగమ్మ ఒడిలోకి చేరాయి. ఈ సందర్భంగా ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.