TG: ఖైరతాబాద్ మహాగణపతి హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ప్రత్యేక పూజల కార్యక్రమం తర్వాత నిమజ్జనం చేయనున్నారు. కాగా, అనుకున్న సమయానికి కంటే ముందుగానే వినాయకుడి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తైన తర్వాత ఇతర గణనాథుల నిమజ్జనానికి పోలీసులు అనుమతివ్వనున్నారు.