AP: లిక్కర్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిస్తూ.. విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచికత్తుతో పాటు ఇద్దరి షూరిటీని సమర్పించాలని తెలిపింది. తిరిగి ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు సరెండర్ కావాలని ఆయనను ఆదేశించింది. కాగా, మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.