TG: బాలాపూర్ లడ్డూ కోసం తాను 7 సంవత్సరాలుగా వేలం పాటలో పాల్గొంటున్నట్లు కర్మన్ ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ తెలిపారు. ఈసారి తనను దేవుడు కరుణించాడని అన్నారు. అయితే ఈ లడ్డూని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు తన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు పంచిపెడుతానని దశరథ్ గౌడ్ వెల్లడించారు.