భారత ప్రధాని మోదీ తనకు స్నేహితుడని, భారత్, అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నా. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’ అంటూ పోస్ట్ పెట్టారు.