VZM: చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలోని ఆలయాన్ని 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తామని ఆలయ ఈవో వై. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం స్వామికి నివేదన చేపడతామని, 11:30 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు.