బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ‘X’ వేదికగా ‘కార్మికుల హక్కులు, రైతుల సంక్షేమానికి, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉపప్రధాని జగ్జీవన్ రామ్. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అని పోస్టు చేశారు.