TG: దుబ్బాకలో ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పెత్తనం వద్దనుకునే తనను గెలిపించారని తెలిపారు. కవిత చెప్పినవన్నీ పాత విషయాలేనన్నారు. కవిత మరోసారి కొత్త విషయాలు చెబుతారని ఆశిద్దామని చెప్పారు. ఆమె సానుభూతి తనకు అవసరంలేదని స్పష్టం చేశారు.