MLG: వాజేడు మండలం చింతూరు గ్రామపంచాయతీలో 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ధర్మవరం–చెరుకూరు రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది. అలాగే గుడుంబా నిర్మూలనపై గ్రామాన్ని గుడుంబా రహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని ప్రజా పోరాట సమితి సభ్యులు తీర్మానం చేయాలని కోరుతూ సర్పంచ్, పోలీసు, తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.