కుమార్తె మరణ బాధలో ఉన్నా తాను ఎదుర్కొన్న అధికారిక అవినీతి గురించి బెంగళూరుకు చెందిన మాజీ CFO కే. శివకుమార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. BPCLలో పనిచేసిన శివకుమార్, కూతురి లాంఛనాల సమయంలో కొందరు అధికారులు కనీసం కనికరం లేకుండా ప్రవర్తించారని, డబ్బు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరమైన సమయంలో కూడా అవినీతిని ఎదుర్కోవాల్సి రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.