AP: రాష్ట్రవ్యాప్తంగా 53 బార్ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏడాది కాలపరిమితి ఉన్న లైసెన్సులకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 డిసెంబర్ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు బార్ల లైసెన్సులకు వేలం జరగనుంది. ఈ-వేలం, ఆన్లైన్ లాటరీ విధానంలో బార్లు కేటాయించనున్నారు. ఈ నెల 22 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు.