AP: జల్జీవన్ మిషన్ను మరింత బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. రోజుకి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని వెల్లడించారు. నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతోనే ఈ మిషన్ ప్రారంభమైందని అన్నారు. ఉన్న నీటి వనరులను బలోపేతం చేయడం, వాటి నిర్వహణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఉద్యోగులే కాకుండా ప్రజలను కూడా భాగస్వాములు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు.