మార్కెట్లో మరో సరికొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొరియర్ సర్వీస్ DHL పేరిట స్కామ్‌లు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. మీ ఆర్డర్‌ను డెలివరీ చేయడంలో అంతరాయం కలిగింది.. మీ డెలివరీ డేట్ అండ్ టైంను మళ్లీ ఫిక్స్ చేయాలంటూ QR కోడ్‌ను స్కాన్ చేయాలంటూ ఆగంతకులు ఇంటి బయట పాంప్లెట్ను పెడుతున్నారు. అయితే.. దీనిని స్కాన్ చేసిన అనంతరం మన ఫోన్లో సమాచారం, అకౌంట్లలో నగదు మాయమవుతాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.