TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఆయన బెయిల్ పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా వేయాలని తిరుపతన్న లాయర్లు కోరారు. క్రిస్మస్ సెలవుల తర్వాత విచారించాలని ప్రభుత్వ న్యాయవాదులు రిక్వెస్ట్ చేశారు. దీంతో జనవరి 2కు విచారణ వాయిదా వేస్తూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.