మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ లుక్స్‌పై ఆయన అభిమాని ఒకరు మంచు విష్ణుకు రిక్వెస్ట్ పెట్టాడు. ‘అన్నా కన్నప్ప ఎలా ఉన్నా.. ఐదు సార్లు చూస్తాను. కానీ ప్రభాస్ లుక్స్, పాత్ర అద్భుతంగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి మంచు విష్ణు స్పందించారు. ఖచ్చితంగా ప్రభాస్ రోల్ అద్భుతంగా ఉంటుందని, ప్రభాస్ అభిమానులు ఎంజాయ్ చేస్తారని రిప్లై ఇచ్చారు.