బ్రిస్బేన్లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ చేరుకునే అవకాశాలు క్లిష్టంగా మారాయి. భారత్.. ఆసీస్తో మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా WTC ఫైనల్ చేరుకుంటుంది. ప్రస్తుతం WTC ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా(1), ఆస్ట్రేలియా(2), భారత్(3) స్థానాల్లో నిలిచాయి.