TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బన్నీ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై పలువురు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సీఎంపై అనుచిత పోస్టులు పెట్టిన కొంత మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు.