TG: నాలుగవ రోజు రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అసెంబ్లీ ముందు 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. రాష్త్ర పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ సవరణ బిల్లును CM రేవంత్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే తెలంగాణ భూ భారతి బిల్ 2024ను సభలో మంత్రి పొంగులేటి ప్రవేశపెట్టనున్నారు. 2 బిల్లులపై చర్చించి శాసనసభ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆటో డ్రైవర్ల సమస్యపై BRS వాయిదా తీర్మానం చేయనుంది.