TG: అసెంబ్లీలో మాజీమంత్రి KTRపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులు, స్కాలర్షిప్స్పై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. విదేశీ స్కాలర్షిప్స్ కాంగ్రెస్ ఇవ్వటం లేదని BRS ఆరోపించింది. ఎలాంటి స్కాలర్షిప్స్ ఆపలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అయినప్పటికీ BRS నేతలు సభలో గందరగోళం సృష్టించటంతో తమ సీట్లలో కూర్చోకపోతే సస్పెండ్ చేస్తానంటూ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు.