దేశ రాజధాని ఢిల్లీలో చలికి తోడు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. మంగళవారం నుంచి ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4(Graph 4)పై ఆంక్షలను విధించినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది.అయితే ఢిల్లీలో రెండో రోజు కూడా గ్రాప్ 4 ఆంక్షలు అమలవుతున్నాయి. కాగా.. ఢిల్లీ నగరంలోని కాలుష్యంపై సుప్రీంకోర్టులో డిసెంబర్ 19వ తేదిన మరోసారి విచారణ జరగనుంది.