AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలుకు చేరుకోనున్నారు. అక్కడ వైసీపీ నేత తెరనేకల్ సురేంద్ర కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు. అనంతరం స్థానిక పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.