TG: రాష్ట్ర అప్పులు, స్కాలర్‌షిప్స్‌పై అసెంబ్లీలో ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. విదీశీ స్కాలర్షిప్స్ ఆపేశారని BRS ఆరోపిస్తూ.. చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలకు సమాధానమిస్తూ.. ఎలాంటి స్కాలర్షిప్స్ ఆపలేదంటూ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ వేశారు. స్పీకర్‌పై BRSకు గౌరవం లేదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ తీరుపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.